Power: వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.. నెంబర్ ఇదే.. ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు..

విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా.. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసేవారు. కానీ ఇక నుంచి వాట్సప్ నుంచే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ వాట్సప్ సేవలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఒక నెంబర్‌ను ప్రవేశపెట్టింది.

Power: వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.. నెంబర్ ఇదే.. ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు..
Whatsapp

Updated on: Jul 30, 2026 | 9:42 PM

ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఇప్పటికే నిరంతరం 24 గంటల పాటూ అందుబాటులో ఉండేలా సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్‌ను ఏపీసీపీడీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. 1912 నెంబర్‌ను ఎప్పటినుంచో ప్రవేశపెట్టింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. ఇక నుంచి వాట్సప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఏపీసీపీడీసీఎల్ వాట్సప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలనేది చూద్దాం.

ఏపీసీపీడీసీఎల్ వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే సేవలను తాజాగా ప్రారంభించింది. ఇందులో భాగంగా 8330911912 నెంబర్‌ను తీసుకొచ్చింది. ఈ నెంబర్‌కు వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు పంపితే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. ముందుగా ఈ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు మీ సమస్యను తెలియజేశారు. సమస్యకు సంబంధించి ఫొటోలను కూడా పంపించాలి. కూలుతున్న స్తంభాలు, తీగలు కింద పడిపోతుండటం, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారడం, మీ చుట్టుపక్కల దొంగ కరెంట్ వాడుతుండటం లాంటివి ఫొటోలు తీసి వాట్సప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీంతో అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మీ మెస్సేజ్‌కు సమాధానం అందిస్తారు.

ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు వాట్సప్ నెంబర్ ద్వారా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటల పాటు ఈ వాట్సప్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సప్‌లో ఫిర్యాదు చేస్తే మీ సమస్య వేగవంతంగా పరిష్కారం అవుతుంది. ఇప్పటికే ఏపీసీపీడీసీఎల్ ప్రవేశపెట్టిన కాల్ సెంటర్ 8 జిల్లాల పరిధిలోని వినియోగదారులకు అందుబాటులో ఉంంది. మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా 1912 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. వినియోగదారుడు తమ పేరు, కనెక్షన్ నెంబర్ తెలియచేస్తే అధికారులు ఫిర్యాదు నమోదు చేస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us