AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. శరవేగంగా దూసుకొస్తోంది. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే టార్గెట్‌ కాబోతున్నాయి.

AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
Ap Rains

Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 11:35 AM

ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. శరవేగంగా దూసుకొస్తోంది. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే టార్గెట్‌ కాబోతున్నాయి. అవును ఈ వార్త ఇప్పుడు ఆ ప్రాంతాల ప్రజలను కలవరపెడుతోంది. ఇంకా వరుణుడు సృష్టించిన జల విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఆ 4 జిల్లాలు. కానీ ఇంతలోనే మరో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.  ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక తమిళనాడు కూడా ప్రమాదం అంచున ఉంది. ఈ నెల 30న దక్షిణ అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో కుండపోతగా భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రాత్రి వరకు తమిళనాడులోని పలు జిల్లాల్లో వానలు ముంచెత్తుతాయని వెల్లడించింది. చెన్నై సహా, కడలూరు, మైలాడు దురై, రామనదాపురం, తూత్తుకుడి , నాగపట్నం జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని తెలిపింది. ఇక రేపు కన్యాకుమారి, తిరునెల్వేలిలో అతి భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

మరోవైపు ఇప్పటికే జల సంద్రంగా మారింది చెంగల్పట్టు జిల్లా. కాంచీపురం జిల్లాలో పాలారు నది మహోగ్రరూపం దాల్చింది. పాలారు నదీ తీరంలో వాటర్‌ పైప్‌ లైన్స్‌ దెబ్బతినడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం.

Also Read:

Telangana: కళ్లు బైర్లు కమ్మేలా శిల్పా చౌదరి క్రైం డేటా.. పోలీసులే షాక్