AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

AP Weather Forecast: తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన ప్రభావంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

AP Weather: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Ap Weather Forecast 19th June 2026
Janardhan Veluru
|

Updated on: Jun 18, 2026 | 5:51 PM

Share

తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో శుక్రవారంనాడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (19-06-26)నాడు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

కాగా గురువారం (జులై 18) సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో గరిష్ఠంగా అల్లూరి జిల్లా కృష్ణాపురంలో 55.5మిమీ, మర్కాపురం జిల్లా మేడపిలో 54మిమీ వర్షపాతం నమోదయ్యింది.  విజయనగరం జిల్లా జరజాపుపేటలో 47మిమీ, పల్నాడు జిల్లా మాడుగులలో 40మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 33.7మిమీ, విశాఖ జిల్లా పద్మనాభంలో 33మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.

Follow Us
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..