AP Weather Alert: ఏపీకి మళ్ళీ పొంచి ఉన్న వాన గండం.. రాగాల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు, నెల్లూరు,..

AP Weather Alert: ఏపీకి మళ్ళీ పొంచి ఉన్న వాన గండం.. రాగాల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Ap Rains

Updated on: Dec 02, 2021 | 2:11 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో భారీవర్షాలు, వరదలు  సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోక ముందే మళ్ళీ అండమాన్ సముద్రం ప్రాంతములో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినది. బుధవారం మధ్య అండమాన్ సముద్రం..  దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం,  అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తం లో తుపాన్ గా మారుతుంది .ఇది తరువాత వాయువ్య దిశలో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతం తీరానికి ప్రయాణించి ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిస్సా తీరాన్నీ ఈనెల 4వ తేదీని తాకవచ్చు అని హెచ్చరించారు.  అనంతరం ఈ తుపాన్ ఉత్తర ఈశాన్య దిశలో ప్రయానిస్తుందని.. దీనివలన ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందో చెప్పారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని
కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. రేపు, ఎల్లుండి తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

Also Read:  రోజూ 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడిస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..