Andhra Pradesh Weather Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఈ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం ఏరియాలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన గాలులు రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న బైక్స్‌ను ఈడ్చుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఆరుతడి పంటలతో పాటు మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విశాఖ జిల్లా పాడేరులో కూడా భారీ వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రితో పాటు సీతానగరం, గోకవరం, అనపర్తి, పిఠాపురం ఏరియాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడ్డాయి.
తాజా అల్పపీడనం తుఫానుకు అసానిగా నామకరణం చేశారు. దీని ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా అక్కడ పర్యాటక కార్యకలాపాలు నిలిపివేశారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది.
Also read:
AIIMS Gorakhpur 2022: నెలకు రూ. 67 వేల జీతంతో ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ జాబ్స్..