Andhra Pradesh: ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం.. ఇదే చివరి ఛాన్స్.. మిస్సయితే మీ ఓటు గల్లంతే..

ఏపీలోని ఓటర్లకు అలర్ట్. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. బీఎల్వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఈ ప్రాసెస్ చేపట్టారు. కొంతమంది పేర్లను తొలగించారు. అయితే ఇప్పుడువారికి మరో అవకాశం ఇస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం.. ఇదే చివరి ఛాన్స్.. మిస్సయితే మీ ఓటు గల్లంతే..
Sir

Edited By:

Updated on: Sep 01, 2026 | 7:19 PM

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఈసీ మరోసారి గడువులు మార్చింది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అనర్హుల పేర్లను తొలగించేలా చేపట్టిన SIR ప్రక్రియలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు మరింత సమయం ఇచ్చింది. ఏపీ సీఈవో విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.

మే 14న SIRకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం మే 14న షెడ్యూల్‌ ప్రకటించింది.
2026 జూలై 1ను అర్హత తేదీగా తీసుకుని SIR చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల పరిశీలన, జాబితా సవరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు.

జూన్ 15 నుంచి ఇంటింటి కసరత్తు

SIRలో భాగంగా జూన్ 15 నుంచి బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఓటర్ల వివరాల పరిశీలనతో పాటు.. జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. తర్వాత డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల చేసి.. క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరించే దశకు ప్రక్రియ చేరింది.

తొలుత సెప్టెంబర్‌ 22న ఫైనల్‌ జాబితా

తొలి షెడ్యూల్‌ ప్రకారం జూలై 21న డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరించాలి. వాటి పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్‌ 18 వరకు పూర్తి చేసి.. సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది.

మారిన షెడ్యూల్‌తో అక్టోబర్‌ 3కు

అయితే SIR ప్రక్రియలో గడువులు మారాయి. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల తేదీ జూలై 31కి మారింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు గడువు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఇచ్చారు. వాటి పరిష్కారానికి సెప్టెంబర్‌ 28 వరకు గడువు నిర్ణయించారు. దీంతో తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్‌ 3కి చేరింది.

ఇప్పుడు మరోసారి గడువు పొడిగింపు

తాజాగా ఏపీ సీఈవో చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1న మరోసారి షెడ్యూల్‌ సవరించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు గడువు సెప్టెంబర్‌ 10 వరకు పొడిగించారు.
క్లెయిమ్స్‌, అభ్యంతరాల నోటీసులు, పరిష్కార ప్రక్రియ అక్టోబర్‌ 5 వరకు కొనసాగుతుంది

అక్టోబర్‌ 9న ఫైనల్‌ ఓటర్ల జాబితా

తాజా సవరణతో తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ కూడా మారింది. ఇప్పటికే నిర్ణయించిన అక్టోబర్‌ 3 స్థానంలో.. అక్టోబర్‌ 9న ఫైనల్‌ ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. అంటే.. క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిశీలనకు మరింత సమయం ఇచ్చిన ఈసీ.. తుది జాబితా విడుదలను ఆరు రోజులు ముందుకు జరిపింది.

ఒకసారి డేట్లు చూస్తే..

తొలి షెడ్యూల్‌:

డ్రాఫ్ట్‌ – జూలై 21

క్లెయిమ్స్‌ – జూలై 21 నుంచి ఆగస్టు 20

పరిష్కారం – సెప్టెంబర్‌ 18 వరకు

ఫైనల్‌ జాబితా – సెప్టెంబర్‌ 22

తర్వాత సవరించిన షెడ్యూల్‌:

డ్రాఫ్ట్‌ – జూలై 31

క్లెయిమ్స్‌ – జూలై 31 నుంచి ఆగస్టు 30

పరిష్కారం – సెప్టెంబర్‌ 28 వరకు

ఫైనల్‌ జాబితా – అక్టోబర్‌ 3

తాజా షెడ్యూల్‌:

క్లెయిమ్స్‌ – జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 10

పరిష్కారం – అక్టోబర్‌ 5 వరకు

ఫైనల్‌ జాబితా

ఓటర్లకు కీలక అవకాశం

తాజా గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకునేందుకు.. పేరు లేకపోతే నమోదు చేసుకునేందుకు.. వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు.. అర్హత లేని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు మరింత సమయం లభించింది. సవరించిన షెడ్యూల్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఈసీ ఏపీ అధికారులను ఆదేశించింది. జూన్‌లో ప్రారంభమైన SIR కసరత్తు.. వరుసగా మారుతున్న గడువులతో కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 5 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారం.. అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us