Roja Rock Gardens: మంత్రి రోజాను ఆకట్టుకుంది రాక్ గార్డెన్. అక్కడి రాళ్ల అందాలు, కళాఖండాలను చూస్తూ.. ఫొటోలు దిగుతూ సందడి చేశారామె. అంతేకాదు. ఆ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోని హరిత గార్డెన్స్ ను సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి రోజా..రాక్ గార్డెన్ అందాలను చూస్తూ ఫొటోలు దిగారు. అక్కడ ఐరన్ స్క్రాప్ తో ఏర్పాటు చేసిన కళాఖండాలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఓర్వకల్లు లోని అధికార గార్డెన్స్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఆకృతులను చూసి మెచ్చుకున్నారు. రాక్ గార్డెన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని.. ఆ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో టూరిజం డెవలప్‌మెంట్‌కు జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్వయంగా టూరిజం స్పాట్లకు వెళ్లూ వాటికి ప్రచారం కల్పిస్తున్నారు మంత్రి రోజా.
ఇక్కడ భూమిలో నుంచి వచ్చిన రాళ్లు, పరిసర ప్రాంతాల్లో అంతా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి అని ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండస్ట్రియల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను నెలకొల్పడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దగ్గరలోనే విమానాశ్రయం ఉండడంవల్ల హరిత గార్డెన్స్ ను ఇంకా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కాదని తర్వాత చంద్రబాబు నాయుడికి బాధలే బాధని , మంగళగిరి, కుప్పం ప్రజలు నారా లోకేష్ ట్రైలర్ ఎప్పుడో చూశారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం రావడం కలలో జరిగే పని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..