ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..

|

Jan 29, 2021 | 7:36 AM

AP Tenth Exams: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్...

ఏపీ: జూన్ 7 నుంచి పది పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..
Follow us on

AP Tenth Exams: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్‌ను రూపొందించారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉదయం 9.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

అలాగే కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఇందులో సైన్సు‌కు రెండు పేపర్లు.. మిగిలిన 5 సబ్జెక్ట్‌లకు 5 పేపర్లుంటాయి. అలాగే జూన్ 17 నుంచి జూన్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి.. జూలై 5న పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక కరోనా వల్ల బడులను తిరిగి ప్రారంభించడంలో జాప్యం జరిగినందున ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 166 రోజుల పాటు మే 31 వరకు క్లాసులు జరగనున్నాయి.

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు…

కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల పనిదినాలను కుదించడం వల్ల ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ bie.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొంది.

పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:

జూన్ 7 – మొదటి భాష, మొదటి భాష కాంపోజిట్
జూన్ 8 – రెండో భాష ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పార్మీ)
జూన్ 9 – మూడో భాష(ఆంగ్లం)
జూన్ 10 – గణితం
జూన్ 11 – భౌతిక శాస్త్రం
జూన్ 12 – జీవ శాస్త్రం
జూన్ 14 – సాంఘిక శాస్త్రం

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?