
బనకచర్ల ఒక గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్.. అందులో నో డౌట్. గోదావరి నీటిని గనక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలోనూ పంటలు పండిచొచ్చు. అందుకే.. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్ కట్టారు. ఏపీలో పోలవరం కడుతున్నారు. అసలు తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి. కృష్ణా నదిపై పైరాష్ట్రాల వాళ్లు బోలెడు ప్రాజెక్టులు కట్టుకున్నారు. పైన ప్రాజెక్టులు నిండిన తరువాతే.. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీళ్లొస్తాయి. అందుకే, వర్షాకాలంలో గోదావరి వరద పోటెత్తి ప్రాజెక్టులు నిండుతాయి గానీ కృష్ణమ్మ పొంగడం చాలా తక్కువ. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ వరద చూస్తే, ఏడాదికి కనీసం 3వేల నుంచి 4వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి. 3వేల టీఎంసీల నీళ్లు సంద్రంలో కలపడం కంటే.. అందులో 10 శాతం వాడినా కరువు పోతుంది. ఆ ప్రయత్నమే బనకచర్ల. ముందుగా గోదావరి నీటి ప్రవాహ తీరును చూద్దాం. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర, మంథని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తుంది. ఒక్కసారి భద్రాచలం దాటిన తరువాత.. ఇక ఆ నీరంతా పట్టిసీమ, రాజమండ్రి, అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తుంది. అటు తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాదసాగర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. కాని, ఏపీలో గోదావరిపై ధవళేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్ట్. ప్రస్తుతం...