Telangana: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం..BRSలోకి టీడీపీ ఎమ్మెల్యే గంటా, జేడీ లక్ష్మీనారాయణ..!

|

Feb 02, 2023 | 9:32 PM

ఏపీలో పాగా వేసేందుకు బీఆర్‌ఎస్ వేగంగా పావులు కదుపుతుంది. సీఎం కేసీఆర్ ఫోకస్ లైట్‌గా ఏం లేదు. ఏకంగా బడా లీడర్స్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Telangana: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం..BRSలోకి టీడీపీ ఎమ్మెల్యే గంటా, జేడీ లక్ష్మీనారాయణ..!
MLA Ganta Srinivasa Rao - MLA Vivek - Lakshmi Narayana
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ బిగ్ ప్లాన్స్ వేస్తోందా? అవును అనడానికి తాజా పరిణామాలే సాక్ష్యం. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్… మరికొంత మంది కీలక నేతలకు గాలమేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఏపీలో ఉన్న కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాపు, బలిజ, వైశ్య వర్గాల్లో కీలక నేతల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తోట చంద్రశేఖర్‌ ద్వారా ఏపీలో కాపుల్ని దగ్గర చేసుకోవడంలో తొలి అడుగు వేసిన కేసీఆర్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు పార్టీలో చేర్చుకునే వ్యూహంలో ఉన్నారు.

ఈ వ్యూహంలో భాగంగా ఇవాళ మేడ్చల్ జిల్లా BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే.. ఒకప్పటి టీడీపీ నేత వివేకానంద్ గౌడ్.. గంటా శ్రీనివాసరావుతో విశాఖపట్నంలో భేటి అయ్యారు. ఇప్పటికే విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ఏపీలో బీఆర్ఎస్ ఆగమనాన్ని ఘనంగా ప్రారంభించాలనుకుంటున్న కేసీఆర్ గంటా సాయంతో జన సమీకరణకు సిద్ధం కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గంటా టీడీపీలో ఉన్నప్పటికీ కొద్ది నెలలుగా యాక్టివ్‌గా లేరు. లోకేష్ పాదయాత్ర సందర్భంలో మళ్లీ టీడీపీ నేతలతో టచ్‌లోకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఉత్తరాంధ్రలో తన చిరకాల శత్రువు అయ్యన్న నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సరిగ్గా ఈ పరిస్థితినే అవకాశంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఇవాళ వివేకా-గంటా శ్రీనివాస్ భేటిలోఇదే విషయం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఒక్క కాపుల్ని మాత్రమే కాదు.. అటు బలిజ సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవడంలో భాగంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కూడా ఇవాళ వివేకానంద్ గౌడ్ భేటి అయ్యారు. మొత్తంగా రాబోయే రోజుల్లో విశాఖలో భారీ సభ పెట్టి ఇద్దరు కీలక నేతల్ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఏపీలో తమ సత్తా చూపించుకోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. మొత్తంగా విశాఖ సభలో అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సంచలన రాజకీయాలకు తెర తీసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. త్వరలో మరి కొందరు నేతలతో కూడా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ లిస్ట్‌లో ఏపీకి చెందిన విద్యాసంస్థల అధినేతలు, ఉద్యమ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లతోను టచ్‌లో ఉంది బీఆర్ఎస్‌. కాపు, వైశ్య, బలిజ సామాజిక వర్గాల నేతలే లక్ష్యంగా బీఆర్ఎస్ రాజకీయం సాగుతుంది. విశాఖ సభలో అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సంచలన రాజకీయాలకు తెర తీసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మరి కొందరు నేతలతో హైదరాబాద్‌లో మరో సమావేశం కానున్నారు బీఆర్‌ఎస్ నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..