AP Skill Case: నేడు ఏపీ హైకోర్టులో స్కిల్‌ కేసు విచారణ.. ఈనెల 28తో ముగియనున్న చంద్రబాబు మధ్యంతర బెయిల్‌

| Edited By: Ravi Kiran

Nov 16, 2023 | 1:27 PM

ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ఇప్పటికే ముగిశాయి. హైకోర్టులో నిన్న జరిగిన విచారణలో.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను ఈ మధ్యాహ్ననికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

AP Skill Case: నేడు ఏపీ హైకోర్టులో స్కిల్‌ కేసు విచారణ.. ఈనెల 28తో ముగియనున్న చంద్రబాబు మధ్యంతర బెయిల్‌
Follow us on

ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ఇప్పటికే ముగిశాయి. హైకోర్టులో నిన్న జరిగిన విచారణలో.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను ఈ మధ్యాహ్ననికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

చంద్రబాబుపై 8 కేసులు న‌మోదు చేసింది ఆంధ్రప్రదేశ్ సీఐడీ. ఇందులో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్‌ కేసు ఒకటి. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. రాజ‌మండ్రి జైలులో 53 రోజుల పాటు ఉన్నారు చంద్రబాబు. కంటి శ‌స్త్ర చికిత్స కోసం బెయిల్‌ ఇవ్వాలన్న చంద్రబాబు వినతి మేరకు.. కోర్టు నాలుగు వారాల పాటు వెసులుబాటు ఇచ్చింది. ఆ బెయిల్‌ గడువు 28తో ముగుస్తుంది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు చంద్రబాబు. దానిపై తీర్పు రావాల్సి ఉంది.

ఇదిలావుంటే, ఈ స్కిల్‌ కేసులో యోగేష్‌ గుప్తా ముందస్తు బెయిల్‌పై విచారణ కూడా ఇవాళ కోర్టు ముందుకు రానుంది. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌లో యోగేష్ గుప్తా కీలకంగా వ్యవహారించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే స్కిల్‌ కేసులో ఏ22గా ఉన్న యోగేష్‌ గుప్తాకు బెయిల్‌ ఇవ్వొద్దని పిటిషన్‌ వేశారు సీఐడీ అధికారులు. IRR, ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో కూడా గుప్తా పేరును చేర్చాయి దర్యాప్తు సంస్థలు. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారని ఆరోపణలు వచ్చాయి. అందుకోసం షెల్‌ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్‌ గుప్తా కీలక పాత్ర పోషించారని సీఐడీ అభియోగం మోపింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…