Rain Alert in Andhra Pradesh బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈ రోజు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Also Read: