AP Panchayat Elections results 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవా

|

Feb 17, 2021 | 10:09 PM

AP Sarpanch Elections result: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు (బుధవారం) మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీలో 51,369 మంది అభ్యర్థులు ఉన్నారు.

AP Panchayat Elections results 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవా

AP Local Elections Phase 3 results: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2వేల639 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరగుతోంది. ఇది మరికాసేపట్లో నేతల భవితవ్యం తేలనుంది. మూడో విడతలో జరుగుతున్న స్థానాల్లో 7వేల757 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలై మధ్యాహ్నాం 3.30 గంటలకు ముగిసింది. ఇక మూడో విడతలో 3,321 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నికగ్రీవమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో అధికార వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది.

రాష్ట్రంలో 2639 సర్పంచ్‌, 19,553 వార్డులకు పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 65 శాతం పోలింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 70, పశ్చిమగోదావరి జిల్లాలో 72, కృష్ణా 79, గుంటూరు 81 శాతం పోలింగ్ జరిగింది. ప్రకాశం 79, నెల్లూరు 79, చిత్తూరు 77, కడప 68 శాతం పోలింగ్ జరిగింది. కర్నూలు 79, అనంతపురం జిల్లాలో 78 శాతం పోలింగ్ జరిగింది.

అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించిన స్లిప్పులు పంపిణీ చేయడాన్ని గుర్తించి వారిని అడ్డుకున్నారు.

అలాగే విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజన్సీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజన్సీలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత.

చిత్తూరులో లీడర్స్ పంతంతో పరిస్థితి సీరియస్‌గా ఉంటే… విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పిలుపుతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించాలని మావోయిస్టుల కాల్‌తో టైట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు మధ్యలో ప్రజలు… టెన్షన్‌తోనే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు.

పాడేరు. జి.మాడుగుల, మంచంగిపుట్టు, పెదబయలు, జీకే వీధి మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక ఏజెన్సీలో ఈ పరిస్థితి కనిపించింది. మావోయిస్టుల కదలికల్ని గమనించేందుకు డ్రోన్‌ కెమెరాలతో భద్రత పర్యవేక్షించారు పోలీసులు. ప్రస్తుతానికి పోలింగ్‌ ముగిసినా… లెక్కింపు పూర్తై విజేతలను ప్రకటించి, ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఫీల్డ్‌ ఆఫీసర్స్‌కు మెసేజ్ పంపించారు. మరికొన్ని రోజులు అలర్ట్‌గా ఉండాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Feb 2021 09:05 PM (IST)

    కృష్ణా జిల్లా నెలకుర్రులో ఉద్రిక్తత

    కృష్ణా జిల్లా నెలకుర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన ఫలితంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 17 ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిచినా ఫలితం ప్రకటించడం లేదని ఆందోళన చేస్తున్నారు. కావాలనే ఫలితాన్ని తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని 8 వార్డులనూ జనసేన ఏకగ్రీవం చేసుకుంది. గ్రామస్తులు ఆందోళనకు దిగిన విషయం తెలుకున్న ఎంపీడీఓ సూర్యనారాయణ నెలకుర్రుకు వెళ్లారు. దీంతో గ్రామస్తులు ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు.

  • 17 Feb 2021 08:32 PM (IST)

    వైసీపీ మద్దతుదారుల విజయభేరి

    ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయ భేరీ మోగిస్తున్నారు. ఇప్పటివరకు 280 మందికిపైగా ఆ పార్టీ మద్దతుదారుల విజయం సాధించినట్లు అధికారికంగా తెలుస్తోంది.


  • 17 Feb 2021 08:27 PM (IST)

    నాలుగో విడతలో 553 పంచాయతీలు, 10 వేల 921 వార్డులు ఏకగ్రీవం

    మూడో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ఓ వైపు కొనసాగుతుంటే… మరోవైపు 4వ విడత ఏకగ్రీవాల సంఖ్య తేలింది. వీటిని అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 553 పంచాయతీలు, 10 వేల 921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటితో కలిపి… మొత్తం నాలుగు విడతల్లో 2,196 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడతలో 525, రెండో దఫాలో 539, మూడో విడతలో 579, నాల్గవ దఫాలో 553 పంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. 4వ విడత ఎన్నికలు ఈ నెల 21వ తేదీన జరుగుతాయి.

  • 17 Feb 2021 08:16 PM (IST)

    కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్

    ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. 80 శాతం పైగా పోలింగ్ నమోదైనట్టు ప్రకటించింది. అయితే.. అటు విజయనగరం జిల్లా చౌడవాడలో పోలింగ్ బూత్‌లో జరిగిన గొడవతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఇటు కృష్ణా జిల్లా నెలకుర్రులో ఓట్ల లెక్కింపు ముగిసినా.. ఫలితం ప్రకటించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

  • 17 Feb 2021 07:22 PM (IST)

    సర్పంచ్‌గా గెలిచిన స్పీకర్ సతీమణి

    ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ సర్పంచ్‌గా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా వాణిశ్రీ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి తమ్మినేని భారతిపై వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితం వెలువడిన అనంతరం వైసీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. తొగరాం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

  • 17 Feb 2021 05:49 PM (IST)

    వెలువడుతున్న ఫలితాలు

    మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. 13 జిల్లాల్లో ఎన్నికల జరిగాయి. రాష్ట్రంలో 2639 సర్పంచ్‌, 19,553 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఇప్పటివరకూ మొత్తం 29 స్థానాల్లో టీడీపీ, 17 చోట్ల వైసీపీ, జనసేన 1, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.

  • 17 Feb 2021 04:57 PM (IST)

    జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా..

    ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రంలో 2639 సర్పంచ్‌, 19,553 వార్డులకు పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 65 శాతం పోలింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 70, పశ్చిమగోదావరి జిల్లాలో 72, కృష్ణా 79, గుంటూరు 81 శాతం పోలింగ్ జరిగింది. ప్రకాశం 79, నెల్లూరు 79, చిత్తూరు 77, కడప 68 శాతం పోలింగ్ జరిగింది. కర్నూలు 79, అనంతపురం జిల్లాలో 78 శాతం పోలింగ్ జరిగింది.

  • 17 Feb 2021 04:22 PM (IST)

    ఇప్పటివరకు పార్టీల బలాబలాలు

    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. కాగా, ఇప్పటివరకు రెండు విడతల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే…,

    మొత్తం వెలువడిన ఫలితాలు – 6,577

    వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు – 5,279

    టీడీపీ మద్దతుదారులు – 1,045

    బీజేపీ మద్దతుదారులు – 44

    జనసేన మద్దతుదారులు – 57

    ఇతరులు – 152

  • 17 Feb 2021 04:03 PM (IST)

    నరిశెట్టి వారిపాలెంలో నిలిచిపోయిన పోలింగ్

    తమ గ్రామ భూసమస్యలు పరిష్కరించి ,భూరికార్డులు తయారు చేసేవరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేది లేదని కందుకూరు మండలం నరిశెట్టి వారిపాలెం భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో నరిశెట్టి పాలెం గ్రామం ఎన్నికల వేళ బోసి పోయింది.

  • 17 Feb 2021 04:01 PM (IST)

    బస్సుల్లో తరలివచ్చి ఓటేసిన గ్రామస్తులు

    మావోయిస్టు ప్రభావిత ప్రాంతం జి.కే.వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ పోలింగ్ కేంద్రం మార్పు ఓటర్లకు కొత్త కష్టాలుతెచ్చి పెట్టింది. 22 కిలోమీటర్ల దూరంలో గల దారకొండ పంచాయతీ మార్చడంతో ప్రజలకుతిప్పలు తప్పలేదు. గుమ్మరేవుల పంచాయతీ కేంద్రం ఓటర్లను రెండు బస్సుల ద్వారా దారకొండ పోలింగ్ కేంద్రానికి తరలించారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఓటు వేశారు.

  • 17 Feb 2021 03:57 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

    మొత్తంగా చూస్తే మూడో విడతలో 2వేల639 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరగుతోంది. ఇది మరికాసేపట్లో నేతల భవితవ్యం తేలనుంది. మూడో విడతలో జరుగుతున్న స్థానాల్లో 7వేల757 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ జరిగే 3వేల127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా..4వేల118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7వేల245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

  • 17 Feb 2021 03:51 PM (IST)

    మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఘర్షణ

    కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురంలో పంచాయతీ పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ,టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం కాస్త.. ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు పార్టీల నేతలకు సర్ధిచెప్పడంతో గొడవ సమసిపోయింది.

  • 17 Feb 2021 03:24 PM (IST)

    అనంతపురం రూరల్ మండలంలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ

    అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రాచానపల్లిలో దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఒకరినొకరు ఆరోపించుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 17 Feb 2021 03:20 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న 96 ఏళ్ల స్వతంత్ర సమరయోధుడు

    కృష్ణాజిల్లా మొవ్య మండలం మొవ్వ పాలెం కేంద్రంలో 96 సంవత్సరాల స్వతంత్ర సమరయోధుడు బాధర్ల వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 17 Feb 2021 03:12 PM (IST)

    ఇరు పార్టీల నేతల మధ్య కుర్చీ ఫైట్

    విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటరు మా వాడంటే మా వాడంటూ పోలింగ్ సెంటర్‌లోనే కుర్చీలతో కొట్టుకున్నారు. భయాందోళనకు లోనైన పోలింగ్ సిబ్బంది, ఓటర్లు బయటకు పరుగులు తీశారు.

  • 17 Feb 2021 02:04 PM (IST)

    పోలింగ్‌ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగిన అభ్యర్థి

    విశాఖలోని కొయ్యూరు మండలం డౌనూరులో సర్పంచ్‌ అభ్యర్థి రాజులమ్మకు ఇస్త్రీపెట్టె గుర్తు కేటాయించారు. బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కనిపించడం లేదని పోలింగ్‌ కేంద్రం ఎదుట అభ్యర్థి ఆందోళనకు దిగారు.

  • 17 Feb 2021 02:01 PM (IST)

    అభ్యర్థుల గుర్తులు కనిపించడం లేదని ఆందోళన

    ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరులో బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థుల గుర్తులు కనిపించడం లేదని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు.

  • 17 Feb 2021 01:44 PM (IST)

    మావోయిస్టుల పిలుపుతో అలర్ట్‌

    ఏపీలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుండగా, విశాఖ పట్నం,  పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో ప్రజలు ఓటేసేందుకు వెనుకంజ వేయడంతో పోలీసులు వారికి ధైర్యం చెప్పి ఓటు వేయిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో మావోలపై గట్టి నిఘా పెంచారు.

  • 17 Feb 2021 01:34 PM (IST)

    ఏయే జిల్లాల్లో ఎంత శాతం పోలింగ్‌ నమోదైందంటే..

    ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 12.30 గంటలకు వరకు రాష్ట్రంలో 66.48 శాతం పోలింగ్‌ నమోదైంది.

    విజయనగరం – 78.5 శాతం
    కర్నూలు – 71.96 శాతం
    గుంటూరు – 71.67 శాతం
    అనంతపురం – 70. 23శాతం
    ప్రకాశం – 69.95 శాతం
    నెల్లూరు – 69.82 శాతం
    తూర్పు గోదావరి – 67.14 శాతం
    కృష్ణా – 65.88 శాతం
    చిత్తూరు – 64.82 శాతం
    శ్రీకాకుళం – 64.14శాతం
    విశాఖ – 63.23 శాతం
    కడప – 57.34 శాతం
    పశ్చిమగోదావరి – 53.51 శాతం

     

     

  • 17 Feb 2021 01:29 PM (IST)

    12.30 గంటల వరకు 66.48 శాతం పోలింగ్‌

    ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

  • 17 Feb 2021 01:06 PM (IST)

    పోలింగ్‌ కేంద్రం అధికారి గుండెపోటుతో మృతి

    తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఏపీవో దైవకృపావతికి గుండె పోటు వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాకినాడలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • 17 Feb 2021 01:02 PM (IST)

    ఓటు వేసేందుకు వస్తుండగా జీపు బోల్తా

    విశాఖలోని ముంచంగిపుట్ట మండలం లక్ష్మీపురం పంచాయతీ పోలింగ్‌ కేంద్రానికి ఓట్లు వేసేందుకు వస్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

  • 17 Feb 2021 01:00 PM (IST)

    పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్‌ కలెక్టర్‌

    ఏపీలో ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ను జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

  • 17 Feb 2021 12:14 PM (IST)

    అనంతపురం డివిజన్‌లో పోలింగ్‌ శాతం

    ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అనంతపురం డివిజన్‌ పరిధిలోని 19 మండలాల్లో 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.

  • 17 Feb 2021 11:58 AM (IST)

    టీడీపీ నేతల ఆందోళన

    చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించిన స్లిప్పులు పంపిణీ చేయడాన్ని గుర్తించి వారిని అడ్డుకున్నారు.

  • 17 Feb 2021 11:20 AM (IST)

    10.30 గంటల వరకు ఏయే జిల్లాల్లో ఎంత శాతం పోలింగ్‌

    ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటలకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు..
    ప్రకాశం – 36 శాతం
    నెల్లూరు – 43 శాతం
    చిత్తూరు – 31 శాతం
    కడప – 32 శాతం
    కర్నూలు – 78 శాతం
    అనంతపురం – 49 శాతం
    శ్రీకాకుళం – 43 శాతం
    విజయనగరం – 51 శాతం
    తూర్పు గోదావరి – 34 శాతం
    పశ్చిమ గోదావరి – 32 శాతం
    కృష్ణా – 39 శాతం
    గుంటూరు – 46 శాతం
    విశాఖ – 44 శాతం

  • 17 Feb 2021 11:13 AM (IST)

    10.30 గంటల వరకు 49.29 పోలింగ్‌ శాతం నమోదు

    ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా పోలింగ్‌ సజావుగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10.30 గంటలకు 49.29 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 17 Feb 2021 11:11 AM (IST)

    కక్ష సాధింపు చర్యలకు దిగితే చర్యలు

    పోలింగ్‌ కేంద్రాల వద్ద మానవత దృక్పథంలో వ్యవహించేలా ఆదేశాలు ఇచ్చారు విశాఖ జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందించాలన్నారు. మూడో విడతలో168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్‌ తర్వాత ఎవరైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

  • 17 Feb 2021 11:07 AM (IST)

    అభ్యర్థుల గుర్తులు తారుమారు.. పోలింగ్‌ నిలిపివేత

    గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో 12,13 వార్డుల్లో పోలింగ్‌ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈనెల 21న రెండు వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

  • 17 Feb 2021 11:02 AM (IST)

    సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

    విశాఖ పట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజన్సీలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజన్సీలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత.

  • 17 Feb 2021 10:54 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

    ఏపీ పంచాయతీ ఎన్నికల మూడో దశ సందర్భంగా విశాఖలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గొట్టేటి మాధవి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 17 Feb 2021 10:29 AM (IST)

    పోలింగ్ స్టేషన్‌లో అధికారికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు..

    తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో దైవకృపావతి అనే అధికారికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

  • 17 Feb 2021 10:07 AM (IST)

    కొనసాగుతోన్న పోలింగ్ ప్రక్రియ.. ఉదయం 9.30 వరకు ఎంత నమోదైందంటే..

    క్రమంగా పెరుగుతోన్న పోలింగ్ శాతం.. ఉదయం 9.30 గంటల వరకు జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
    కృష్ణా – 8.14 శాతం
    విజయనగరం- 15.3 శాతం
    తూర్పు గోదావరి- 12.6 శాతం
    పశ్చిమ గోదావరి- 11.72 శాతం‌
    విశాఖపట్నం- 13.75 శాతం
    ప్రకాశం 8.04 శాతం
    చిత్తూరు 9.34 శాతం
    నెల్లూరు 9.1 శాతం
    గుంటూరు 18.83 శాతం
    కర్నూలు 15.39 శాతం
    కడప 7.5 శాతం
    అనంతపురం 9.9 శాతం
    శ్రీకాకుళం- 12.87 శాతం

  • 17 Feb 2021 09:28 AM (IST)

    ఏయో జిల్లాలో ఎంత పోలింగ్ నమోదైందంటే..

    ఏపీ పంచాయతీ మూడో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు 11.74 శాతం పోలింగ్ పూర్తి కాగా.. ఆయా జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..
    శ్రీకాళులం – 12.87
    విజయనగరం – 15.30
    విశాఖపట్నం – 13.75
    తూర్పు గోదావరి – 14.63
    పశ్చిమ గోదావరి – 11.72
    కృష్ణా – 8.14
    గుంటూరు – 18.83
    ప్రకాశం – 8.04
    నెల్లూరు – 9.10
    చిత్తూరు – 9.34
    కడప – 7.57
    కర్నూలు – 15.39
    అనంతపురం – 9.97

  • 17 Feb 2021 09:21 AM (IST)

    ఏపీలో కొనసాగుతోన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 11.74 శాతం పూర్తి.

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 8.30 వరకు 11.74 శాతం ఓటింట్ పూర్తయింది.

  • 17 Feb 2021 09:18 AM (IST)

    ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు.. సమస్యలు పరిష్కరించే వరకు..

    ప్రకాశం జిల్లా నరిశెట్టిపాలెం గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ తేల్చి చెప్పారు. సర్పంచ్ సహా 14 వార్డుల్లో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.

  • 17 Feb 2021 09:13 AM (IST)

    ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రాలు లాక్కొంటున్నారని ఆరోపణ.. ఎస్పీకి ఫిర్యాది చేసిన మాజీ మంత్రి.

    అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రాలు లాక్కుంటున్నారని ఓ వర్గం ఆరోపణ చేస్తోంది. బ్యాలెట్ పత్రాలు లాక్కొని ఓట్లు వేసుకుంటున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పరిటాల సునీత ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదుల చేశారు.

  • 17 Feb 2021 08:39 AM (IST)

    సర్పంచ్‌ అభ్యర్థిని గృహనిర్భంధించిన పోలీసులు.. ప్రత్యర్థి వర్గం ఆందోళన..

    శ్రీకాకుళం జిల్లా పొలకొండ మండలం అంపిలి సర్పంచ్‌ అభ్యర్థిని పోలీసులు గృహ నిర్భందంలో ఉంచారు. పాత కేసుల నేపథ్యంలోనే సర్పంచ్‌ అభ్యర్థిని పోలీసులు నిర్భంధించినట్లు తెలుస్తోంది. అయితే సర్పంచ్‌ అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నారని మరో ప్రత్యర్థి వర్గం ఆందోళన చేస్తోంది.

  • 17 Feb 2021 08:30 AM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్‌.. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు..

    ఏపీలో జరుగుతోన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూత్‌లను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు.

  • 17 Feb 2021 08:09 AM (IST)

    ఉరవకొండలో వాయిదా పడ్డ పోలింగ్‌.. నామినేషన్‌ ఉపసంహరించుకున్నా..

    అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలింగ్‌ను వాయిదా వేస్తూ అధికారులు అర్థరాత్రి తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నా బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కేటాయించారు. దీంతో ఉరవకొండలోని మూడో వార్డు ఎన్నికను ఆలస్యంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

  • 17 Feb 2021 07:57 AM (IST)

    అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆందోళన నిలిచిపోయిన పోలింగ్‌..

    ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద్దకండ్లగుంటలో ఎన్నికల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. అధికారులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గం ఆందోళనకు దిగింది. దీంతో పెద్దకండ్లగుంట 5వ వార్డులో పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది.

  • 17 Feb 2021 07:55 AM (IST)

    ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు.. నిలిచిపోయిన పోలింగ్‌..

    గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్‌ పత్రాల్లో తప్పులు దొర్లాయి. ఇద్దరు అభ్యర్థులకు ఓకే గుర్తు ఉండడంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీంతో మాడగులలోని 12,13 వార్డుల్లో పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ నెల 21న తిరిగి పోలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

  • 17 Feb 2021 07:51 AM (IST)

    ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోన్న రెవెన్యూ డివిజన్లు ఇవే..

    శ్రీకాకుళం, పాలకొండ, విజయనగరం, పాడేరు, రంపచోడవరం, ఎటపాక, జంగారెడ్డి గూడెం, ఏలూరు, కుక్కునూరు, మచిలీ పట్నం, గుజరాల, కందుకూరు, గూడురు, నాయుడు పేట, ఆదోని, కర్నూలు, అనంతపురం, మదనపల్లె, రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికల మూడో విడదల పోలింగ్‌ కొనసాగుతోంది.

  • 17 Feb 2021 07:26 AM (IST)

    బారులు తీరిన ఓటర్లు.. కొనసాగుతోన్న ఓటింగ్‌ ప్రక్రియ..

    మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా ఉదయం పనికి వెళ్లే వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

  • 17 Feb 2021 07:05 AM (IST)

    మూడో విడతలో ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారంటే..

    ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో మొత్తం 55.75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • 17 Feb 2021 06:50 AM (IST)

    పోలింగ్‌ ముగిసిన అరగంటకే కౌంటింగ్‌ ప్రారంభం..

    పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అరగంటకే ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. మొదట గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

  • 17 Feb 2021 06:47 AM (IST)

    మొదలైన పోలింగ్‌.. మాస్క్‌లు ధరిస్తేనే కేంద్రంలోకి అనుమతి…

    ఏపీ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్‌ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ఇక కరోనా పాజిటివ్‌గా తేలిన ఓటర్లకు పోలింగ్‌ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్‌కు అనుమతిచ్చారు.

  • 17 Feb 2021 06:43 AM (IST)

    3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు.. వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షణ..

    మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు 3.127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటితో పాటు మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.

  • 17 Feb 2021 06:39 AM (IST)

    ఈ గ్రామ పంచాయతీల్లో నిలిచిన పోయిన ఎన్నికల ప్రక్రియ..

    మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విశాఖలోని పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టి వారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్‌ పదవులకు మరికాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది.

Follow us on