AP Panchayat Elections 2021 : రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ఉపేక్షించేది లేదు.. భారీ భద్రత ఏర్పాటుచేశామన్న డీజీపీ

ఏపీ పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రేపు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎలాంటి ఆందోళనలు,..

AP Panchayat Elections 2021 : రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ఉపేక్షించేది లేదు.. భారీ భద్రత ఏర్పాటుచేశామన్న డీజీపీ

Updated on: Feb 08, 2021 | 11:13 PM

AP Panchayat Elections 2021 :  ఏపీ పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రేపు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎలాంటి ఆందోళనలు, గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బందిని నియమించామని, 13 వేల పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సవాంగ్ అన్నారు. మొదటి విడతలో పోలింగ్ బాక్స్‌ల భద్రతకు 61 స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు చేశాం.9 ఎస్సీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్సీ రిజర్వ్‌ పార్టీలు సిద్ధం చేశాం. 1122 రూట్‌ మొబైల్స్‌, 199 మొబైల్ చెక్‌పోస్టులు, ఇప్పటివరకు 9,199 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 1,47,931 బైండోవర్‌,12,779 సెక్యూరిటీ కేసులు నమోదు చేశాం. అలాగే షాడో, నిఘా టీమ్‌లు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల వద్ద మద్యం, డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నాం. ఫ్యాక్షన్‌ ఉన్న గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తాం. అనధికారిక, అధికారిక ఆయుధాలు సీజ్ చేస్తాం.కోడ్ అఫ్ కండక్ట్ తప్పినవారిపై ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఉంటాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna Phone Call in AP Politics: పొలిటికల్ అయినా సినిమా అయినా ట్రేండింగ్ లో బాలయ్య ఫోన్ కాల్..!

AP Panchayat Elections 2021: పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..