AP Night Curfew: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ (Andhra Pradesh) లోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ అమల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఏపీలో నిత్యం 10 వేలకు చేరువలో కరోనా వైరస్ (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. అయితే.. మరణా సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 60 ఏళ్లు దాటిన వృద్ధులు కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సూచనలు చేసింది.
నిన్నటి గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 5,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తొమ్మిది మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22, 76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 14,615 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
New Covid19 Advisory for Senior citizens :
60 సం.లు దాటిన వృద్దులకు నూతన కోవిద్ సూచనలు #InstantOrder146 #CovidAdvisory #CovidAdvisoryForSeniorCitizent pic.twitter.com/4zSk8tjzW9— #Covid19Help (@Chinnarao_C) February 1, 2022
Also Read: