పుంగనూరు మున్సిపాలిటీ TDP కైవసం.. నందికొట్కూరులో YCP ఆధిక్యం..! లేటెస్ట్ ట్రెండ్స్ ఇదిగో

AP Municipal Election Results 2026: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకోగా, పెనుకొండలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. నందికొట్కూరులో YCP ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు తునిలో హోరాహోరీ పోరు, కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

పుంగనూరు మున్సిపాలిటీ TDP కైవసం.. నందికొట్కూరులో YCP ఆధిక్యం..! లేటెస్ట్ ట్రెండ్స్ ఇదిగో
Ap Municipal Election Results Updates

Updated on: Nov 03, 2026 | 12:44 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడుదల అవుతున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది. పుంగనూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 30 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నాలుగు స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరిగింది. 36 వార్డుల్లో TDP 30, జనసేన, BJP చెరోరెండు స్థానాలు గెలచుకుంది.

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో YCP ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎనిమిది స్థానాల్లో YCP ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒక స్థానంలో మాత్రం TDP ముందంజలో ఉంది.

ఎనిమిది కార్పొరేషన్లలో కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. విశాఖ, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కడపలో ముందంజలో ఉన్నారు. ఆరుస్థానాల్లో TDP, రెండు స్థానాల్లో జనసేన హవా కొనసాగుతోంది.

కాకినాడ: తుని మున్సిపాలిటీలో YCP, TDP మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఐదు వార్డుల్లో YCP అభ్యర్థులు గెలిచారు. నాలుగు వార్డుల్లో TDP విజయం సాధించగా.. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

పెనుకొండ మున్సిపల్ ఎన్నికను కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. మొత్తం 23 వార్డుల్లో 21 స్థానాలను TDP గెలుచుకుంది. మరో రెండు స్థానాల్లో BJP, జనసేన చెరో వార్డు దక్కించుకున్నాయి.

కౌంటింగ్‌ వేళ కుప్పంలో ఉద్రిక్తత పెరిగింది. TDP, YCP నేతలు వాగ్వాదానికి దిగారు. అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని YCP నేతలు ఆరోపించారు. వారిని కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపాలని డిమాండ్‌ చేశారు.

అనంతపురం: కల్యాణదుర్గం మున్సిపల్‌ కౌంటింగ్‌లో గందరగోళం చెలరేగింది. మూడు వార్డుల్లో YCP అభ్యర్థులు గెలవడంపై TDP నేతలు రీ పోలింగ్‌కు డిమాండ్‌ చేశారు. అధికారులు రీ పోలింగ్ జరపకుండా YCP అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించారు.

ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్‌పై ఎన్నికల సంఘం సమీక్షించింది. తుఫాన్ తీవ్రత ఆధారంగా కౌంటింగ్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. కౌంటింగ్‌ సాధ్యం కాని ప్రాంతాల్లో రేపు నిర్వహించే యోచనలో ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us