AP Model School: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. మే 10 నుంచే ఆదర్శ పాఠశాల అప్లికేషన్స్.. పరీక్ష, ఫీజు, అర్హతల వివరాలివే..

|

May 06, 2023 | 3:37 PM

AP Model School Admissions: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు స్కూల్ విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉతర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉండగా..

AP Model School: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. మే 10 నుంచే ఆదర్శ పాఠశాల అప్లికేషన్స్.. పరీక్ష, ఫీజు, అర్హతల వివరాలివే..
Ap Model School
Follow us on

AP Model School Admissions: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు స్కూల్ విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉతర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉండగా వాటిలో 6వ తరగతిలో చేరాలనుకునేవారు ఈ నెల 10 నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వచ్చే నెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లీషులో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే మోడల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని, చదవాలనుకునేవారు ఎలాంటి ఫీజులు కట్టనవసరంలేదని వివరించారు.

అలాగే ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 మే 9 నుంచి మే 25 వరకు net banking/credit/debit card ద్వారా Payment Gateway ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. అలా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in/apms.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక ప్రవేశ పరీక్షను ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మే 20న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల జాబితాను జూన్‌ 16న, సీట్లు పొందిన వారి జాబితాను 18న ప్రకటిస్తారు. జూన్‌ 19 నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనుండగా.. జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కాగా, ఆబ్జెక్టివ్ టైప్‌లో జరిగే ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి. కావలసినన్ని మార్కులు పొందినవారి ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తామని సురేష్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అర్హతలివే:

  1. వయస్సు: మోడల్ స్కూల్‌లో చదవాలని ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేయాలనుకునే ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2011 నుంచి 31-08-2013 మధ్య.. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు 01-09-2009 నుంచి 31-08-2013 మధ్య జన్మించినవారై ఉండాలి.
  2. ఆంధ్రప్రదేశ్ సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలు చదివి, 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
  3. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఫార్మ్ కోసం www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..