Gautam Reddy RIP: నాన్నకు ప్రేమతో.. మేకపాటి అంత్యక్రియల్లో కన్నీరు పెట్టించిన దృశ్యం..

|

Feb 23, 2022 | 8:21 PM

Gautam Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Gautam Reddy) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Gautam Reddy RIP: నాన్నకు ప్రేమతో.. మేకపాటి అంత్యక్రియల్లో కన్నీరు పెట్టించిన దృశ్యం..
Follow us on

Gautam Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Gautam Reddy) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం నెల్లూరు జిల్లా(Nellore) ఉదయగిరిలోని మేకపాటి కుటుంబానికి చెందిన మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన అశేష జనం గౌతమ్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. చిన్న వయసులోనే ఇలా నూరేళ్లు నిండిపోయాయి.. మంచి మనసున్న నేత అంటూ గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తలుచుకున్నారు. అయితే, గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో ఓ సన్నివేశం అక్కడి వారి గుండెలు పిండేసింది. తండ్రి అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన గౌతమ్ రెడ్డి కుమార్తె, కూతురు.. తమ తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది. గౌతమ్ రెడ్డి కుమార్తె సాయి అనన్య, కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి తండ్రి దుస్తులను ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అది చూసి అక్కడున్న వారి హృదయాలు మరింత బరువెక్కాయి. తండ్రిపై వారికున్న అపారమైన ప్రేమ ఏంటో ఆ దృశ్యాలతో నిరూపితమైంది. ఆ వారసులిద్దరూ తండ్రి పార్థీవ దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు వారిని ఓదార్చారు. ఇక ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక.. గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి.. తండ్రి పార్థీవదేహానికి చితి పెట్టారు. కాగా, గౌతమ్ రెడ్డి పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Also read:

Green Energy: గ్రీన్‌ ఎనర్జీలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుంది.. 21 వ శతాబ్దం మనదే: ముఖేష్ అంబానీ

India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

CJI NV Ramana: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్..25 రోజులు అవుతున్నా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..