Watch: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మంత్రి స్వామి కీలక వ్యాఖ్యలు

| Edited By: Janardhan Veluru

Oct 01, 2024 | 1:41 PM

Tirumala Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లడ్డూలో కల్తీ జరిగిందని అధికారపక్షం, ఆధారాలు లేవంటూ ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు లడ్డూలో కల్తీపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపద్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఇటు అధికారపక్షం, అటు ప్రతిపక్ష నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు.

తిరుపతి లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లడ్డూలో కల్తీ జరిగిందని అధికారపక్షం, ఆధారాలు లేవంటూ ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు లడ్డూలో కల్తీపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపద్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఇటు అధికారపక్షం, అటు ప్రతిపక్ష నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. సుప్రీంకోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు. పూర్తిస్థాయి విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని కిందిస్థాయి దర్యాప్తులో తేలిందన్నారు. ఆ దర్యాప్తు అంశాలు కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు.

లడ్డూ కల్తీపై ప్రాధమిక నివేదికల ఆధారంగా సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోందన్న మంత్రి.. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టినా తాము స్వాగతిస్తామన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని మంత్రి స్వామి స్పష్టం చేశారు. ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫించన్ నగదు పంపిణీ చేసిన మంత్రి

మరోవైపు కొండపి నియోజకవర్గంలోని సూరారెడ్డిపాలెం, వల్లూరు పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు ఎపి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఫించన్ నగదును పంపిణీ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టులో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇంతకుముందు 3 వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని 4వేల రూపాయలకు పెంచడం, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం 7వేల రూపాయలు పెన్షన్ జులై నెలలో ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తామన్నారు. 1వ తేదీన ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్లు పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.