Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

|

May 26, 2023 | 9:09 PM

ఆంధప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారలు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 97 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
Heat Wave
Follow us on

ఆంధప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారలు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని 97 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీటిలో అల్లూరి జిల్లాలో 2, అనకాపల్లిలో 1, బాపట్లలో 7, తూర్పుగోదావరిలో 7, ఏలూరులో 4, గుంటూరులో 17, కాకినాడలో 9, కోనసీమలో 10, కృష్ణాలో 15, ఎన్టీఆర్‌ జిల్లాలో 8, పల్నాడులో 9, మన్యంలో 4, పశ్చిమగోదావరిలో 3, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇదిలా ఉంటే శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9°C, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7°C, చిత్తూరు జిల్లా నింద్ర 43.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..