కనుమరుగవుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గురాయి నిక్షేపాలు.. మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా..?

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ముగ్గు రాయి నిక్షేపాలు కలిగిన మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా... దాదాపు 5 దశాబ్దాల కాలం భారతదేశానికి బెరైటీస్ ఘనులలో వెన్ను దన్నుగా నిలిచిన ఈ గనుల ప్రాంతం మరో రెండేళ్లలో కనుమరుగైపోతుందా..? ఎన్నో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ ప్రాంతం కాలగర్భంలో కలిసిపోనుందా..?

కనుమరుగవుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గురాయి నిక్షేపాలు.. మంగంపేట బెరైటీస్ మైన్స్ ఇక లేనట్టేనా..?
Mangampet Barytes Mines

Edited By:

Updated on: Jan 22, 2026 | 6:13 PM

ప్రపంచంలోనే బెరైటీస్ అంటే గుర్తొచ్చేది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో గల మంగంపేట మైన్స్. ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఆ తరువాత అన్నమయ్య జిల్లాకు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో మంగపేట ముగ్గు రాయి నిక్షేపాలు ఉన్నాయి. అలాంటి మైన్స్ రానున్న కాలంలో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరో రెండేళ్లు మాత్రమే ఇక్కడ ఈ నిక్షేపాలు దొరుకుతాయంట. దాదాపు 52 సంవత్సరాలుగా ఇక్కడ బెరైటీస్ నిక్షేపాలను అందించిన ఈ ప్రాంతం రానున్న కాలంలో ఒక మైలురాయిగా మాత్రమే నిలవనుంది.

ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను వెలికి తీసేటప్పుడు వాడే మిషనరీ ప్రెషర్ వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి ఈ బెరైటీస్‌ను అధికంగా వాడుతారు. 1974లో ప్రారంభమైన ఈ మైన్స్ మరో రెండేళ్ళు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో 5000 మెట్రిక్ టన్నులు మాత్రమే బెరైటీస్ తీయగలమని తేల్చి చెప్పారు. ఏడాదికి మూడువేల మెట్రిక్ టన్నులు ప్రస్తుతం తీస్తున్నామని మంగంపేట బెరైటీస్ గనుల సీపీవో గోపీనాధ్ తెలిపారు. అయితే ఇక్కజ దొరికే పుల్లరిన్ నిక్షేపాల పరిశోధన, దాని శుద్ది జరుగుతుందని ఆయన అన్నారు. మంగంపేట మైన్స్‌లో బెరైటీస్ నిక్షేపాల తవ్వకాలు ఆగిపోయినా.. మరో పది నుంచి పదిహేనేళ్ళ వరకు సరిపోయేలా నిల్వలు ఉన్నాయని సీపీవో తెలిపారు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..