AP Local Body Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అభ్యర్థులు గెలిచేందుకు సామ, ధాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడులో ఒక ఇంట్లో దాచిన ప్రెషర్ కుక్కర్‌లను స్క్వాడ్ టీం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఇంట్లో తనిఖీ చేసి 50 ప్రెషర్ కుక్కర్‌లను స్వాధీనం చేసుకున్నారు. 9వ తేదీన జరగబోయే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కుక్కర్లను తెచ్చి దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న కుక్కర్లను భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కుక్కర్లు ఎవరికి సంబంధించినవి అనే విషయంపై ఆరాతీస్తున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు, వస్తువులు ఎవరైనా పంపినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్