Breaking: మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్ నోటిసులు.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..

|

Feb 12, 2021 | 1:06 PM

Show Cause Notice: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటిసులు జారీ చేశారు. ఎన్నికల..

Breaking: మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్ నోటిసులు.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..
Follow us on

Show Cause Notice: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటిసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ను కించపరుస్తూ మంత్రి ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. ఈ అంశంపై సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా బహిరంగ ప్రకటన చేయాలని పేర్కొంది. కాగా, ఒకవేళ ఈ అంశంపై వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అంతకముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, కొడాలి నాని మీడియా సమావేశం ఫుటేజ్‌ పరిశీలించాక ఎస్‌ఈసీ తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!