ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి భేటి.. ఏం జరిగిందంటే.?

|

Feb 23, 2024 | 1:40 PM

ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది..ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, బొత్స, సజ్జల హాజరు అవ్వగా..అటు నలబ్యాడ్జీలతో ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ నేతలు హాజరైయ్యారు.. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు..అయితే ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చింది జేఏసీ..

ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది..ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, బొత్స, సజ్జల హాజరు అవ్వగా..అటు నలబ్యాడ్జీలతో ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ నేతలు హాజరైయ్యారు.. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు..అయితే ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చింది జేఏసీ..ఇవాళ్టి సమావేశంలో సానూకూలత వస్తే కార్యక్రమాన్ని పునరాలోచిస్తామన్నారు. అయితే ఇప్పటికే చలో విజయవాడకు అనుమతి లేదని ఉద్యోగ సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అయితే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఐఆర్, ఓపీఎస్ అమలు వంటి ప్రధాన డిమాండ్‌లతో జేఏసీ చలో విజయవాడకు పిలుపు నిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. సమావేశానికి వెళ్లే ముందు సజ్జల, బొత్సను కలిసి సచివాలయ సీపీఎస్ సంఘం నేతలు వినతి పత్రాలు అందజేశారు..తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు..