ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పంచాయితీ ఎన్నికలు కొనసాగించాలని ఆదేశించింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ వాదనలు పూర్తి అయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నేడు తీర్పును వెలువరించింది. మరి ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళుతుందో, లేదో చూడాలి.
కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత పిటిషన్‌నపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
Also Read :