Jagan Flag Off Ration Door Delivery Vehicles Live Updates: ఇంటికే రేషన్.. డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం..

|

Updated on: Jan 21, 2021 | 11:45 AM

CM Jagan Inaugurates Live Updates: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా...

Jagan Flag Off Ration Door Delivery Vehicles Live Updates: ఇంటికే రేషన్.. డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం..

CM Jagan Flag Off Ration Door Delivery Vehicles Live Updates: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానానికి తెరతీస్తూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికే రేషన్‌ సరుకులు అందించే కార్యక్రమాన్ని విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద సీఎం జగన్‌ ప్రారంభించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jan 2021 11:33 AM (IST)

    కడపలో వాహనాలు ప్రారంభించిన ఆదిమూలపు..

    రేషన్‌ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన వాహనాలను కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం ఆంజాద్‌బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, కలెక్టర్‌ హరి కిరణ్‌ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 514 వాహనాలు ఇంటకే రేషన్‌ సరుకులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

  • 21 Jan 2021 11:19 AM (IST)

    శ్రీకాకుళంలో వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం..

    ఇంటికే రేషన్‌ సరుకులను అందజేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోబైల్‌ వాహనాలను శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. కోడి రామ్మూర్తి నాయుడు మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

  • 21 Jan 2021 11:13 AM (IST)

    వాహనాలకు ఎంత ఖర్చు చేశారంటే..

    దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటికే రేషన్‌ సరుకులు డెలివరీ చేసేందుకు గాను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ఉపయోగించనుంది. ఈ వాహనాల కోసం ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరి 1నుంచి ఇంటికే రేషన్‌ విధానం ప్రారంభం కానుంది.

  • 21 Jan 2021 11:09 AM (IST)

    కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు...

    రేషన్‌ సరుకులు ఇంటికి డోర్‌ డెలివరీ చేసే క్రమంలో కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ బియ్యం బస్తాకు సీల్‌తోపాటు యూనిక్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.

  • 21 Jan 2021 10:55 AM (IST)

    క్యూ కట్టిన వాహనాలు..

    డోర్‌ డెలివరీ కోసం కేటాయించిన వాహనాలను సీఎం ప్రారంభించిన వెంటనే విజయవాడ రోడ్లపై వాహనాలు బార్లు తీరాయి. ఒకేసారి 2,500 వాహనాలు రోడ్లపై క్యూ కట్టిన దృశ్యం ఆకట్టుకుంటోంది.

  • 21 Jan 2021 10:44 AM (IST)

    వాహనాలను పరిశీలిస్తున్న జగన్‌ మోహన్‌రెడ్డి..

    డోర్‌ డెలివరీ కోసం కేటాయించిన వాహనాలను ప్రారంభించేందుకు బెంజ్‌ సర్కిల్‌ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. అక్కడ ఉన్న వాహనాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా అక్కడి డ్రైవర్లతో చర్చిస్తున్నారు.

  • 21 Jan 2021 10:39 AM (IST)

    విజయవాడ బెంజ్‌ సర్కిల్‌కు చేరుకున్న సీఎం జగన్‌..

    ఇంటికే రేషన్‌ సరుకులను అందించే వాహనాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కాసేపటి క్రితమే విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ చేరుకున్నారు. జగన్‌కు నాయకులు స్వాగతం పలుకుతున్నారు.

  • 21 Jan 2021 10:28 AM (IST)

    ఫిబ్రవరి 1నుంచి డోర్‌ డెలివరీ ప్రారంభం..

    మూడు జిల్లాలకు కేటాయించిన వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించనుండగా.. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీని ఫిబ్రవరి 1నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం 9,260 వాహనాలు సిద్ధం చేశారు.

  • 21 Jan 2021 10:28 AM (IST)

    2,500 వాహనాలకు పచ్చ జెండా ఊపనున్న జగన్‌..

    ఇంటి వద్దకే రేషన్‌ సరుకులను అందజేసే ఉద్దేశంతో ప్రవేశ పెట్టనున్న కొత్త పథకం కోసం ముఖ్యమంత్రి మరికాసేపట్లో వాహనాలను ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు.

  • 21 Jan 2021 10:13 AM (IST)

    ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు..

    రేషన్‌ సరుకుల కోసం వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించిన జగన్‌ ఇంటివద్దకే సరుకులను అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు.

Published On - Jan 21,2021 11:33 AM

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?