MLA Jogi Ramesh: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పార్టీ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చన్న హైకోర్టు.. కానీ

హైకోర్టులో ఎమ్మెల్యే జోగి రమేశ్ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

MLA Jogi Ramesh: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పార్టీ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చన్న హైకోర్టు.. కానీ

Updated on: Feb 12, 2021 | 5:39 PM

MLA Jogi Ramesh:  హైకోర్టులో ఎమ్మెల్యే జోగి రమేశ్ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జోగి రమేశ్‌ మాట్లాడకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో… ఆ ఆదేశాలను హైకోర్టులో జోగి రమేశ్ సవాల్ చేశారు.

పెడనలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే జోగి రమశ్ మాట్లాడుతూ వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఎవరికీ బరిలోకి దిగినా.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తెగ సర్కులేట్ అయ్యాయి. ఎమ్మెల్యే వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్యతం చేశారు. జోగి రమశ్ మాట్లాడిన వీడియోలు ఉండటంతో.. ఈనెల 17 వరకు ఆయన మీడియాతో ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

Also Read:

Minister Kodali Nani Explanation: ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ.. ఏం చెప్పారంటే..?

FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం