Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati: ఏపీ హైకోర్టులో విచారణకు అమరావతి పిటిషన్లు.. సర్వత్రా ఉత్కంఠ.. గొంతు పెంచిన ఆ ప్రాంత నేతలు..

ఏపీ రాజధాని అంశం కాక రేపుతోంది. అధికార పార్టీ నేతలు మూడు రాజధానుల మంత్రం జపిస్తుంటే అమరావతే రాజధాని అంటున్నారు ఆ ప్రాంత వాసులు. సుప్రీం స్టే అనంతరం ఇవాళ ఏపీ హైకోర్టులో మరోసారి అమరావతి పిటిషన్లన్నీ విచారణకు రానున్నాయి‌.

Amaravati: ఏపీ హైకోర్టులో విచారణకు అమరావతి పిటిషన్లు.. సర్వత్రా ఉత్కంఠ.. గొంతు పెంచిన ఆ ప్రాంత నేతలు..
Amaravathi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 02, 2023 | 8:09 AM

అమరావతి పిటిషన్లకు అన్నింటిపైన ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది‌‌. అమరావతిలో మౌళిక వసతులు, భూముల కేటాయింపు అంశాలపై నివేదిక ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అమరావతి రైతులు ఇంప్లీడ్ పిటిషన్ వేసారు. అమరావతి అంశం ఆధారంగా ఉన్న అన్ని పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులలో ఏడు అంశాలు పొందుపరిచింది. ఏపీసీఆర్‌డీఏ 2015 ల్యాండ్‌ పూలింగ్‌ షెడ్యూల్ 2,3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ  నిర్వర్తించాలని ఆదేశించింది‌‌. థర్డ్‌ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్‌ ల్యాండ్‌ తనాఖా పెట్టరాదు.

రాజధాని నిర్మాణం, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌కు తనాఖా పెట్టవచ్చు.సీఆర్‌డీఏ యాక్ట్‌ సెక్షన్‌ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్‌ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెల రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు సూచించింది. ఏపీ రాజధానిపై హైకోర్టు నుంచి సుప్రీం వరకు అనేక సందర్భాల్లో కేసులు, విచారణల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

అయితే రాజకీయ నేతలు మాత్రం తమ వాదన కొనసాగిస్తున్నారు. విశాఖను రాజధాని చేయకపోతే… తమకో రాష్ట్రం కావాలంటూ కామెంట్ చేశారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. ధర్మాన వ్యాఖ్యల నేపథ్యంలో రాయలసీమ నేతలు గొంతు పెంచారు.

ఇవి కూడా చదవండి

రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ నినదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అనంతరం అమరావతి పిటిషన్లపై హైకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం