ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శిలపై హైకోర్టు సీరియస్.. ఈనెల 27న కోర్టుకు రావాలని సమన్లు జారీ..!

పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శిలపై హైకోర్టు సీరియస్.. ఈనెల 27న కోర్టుకు రావాలని సమన్లు జారీ..!

Updated on: Jan 25, 2021 | 1:22 PM

AP high court summons DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఓ పోలీసు అధికారికి పదోన్నతి కల్పించడంలో నిర్లక్ష్యం చేసినందుకు రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోర్టు ధిక్కారం కింద డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరు కాలేమని ఇద్దరు అధికారులు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సుప్రీం నిర్ణయం వచ్చే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని ఓ వైపు సీఎస్‌ కోరుతుండగా.. డీజీపీ, హోంశాఖ కార్యదర్శి ఎన్నికల విధులు అంటున్నారని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వీరిద్దరూ ఈ నెల 27న తప్పకుండా తమ ఎదుట హాజరు కావాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది హైకోర్టు.

Read Also… AP Local polls Live Updates : మెగా మండే లోకల్ ఎలక్షన్.. ఏపీలో ‘పంచాయతీ’కి లైన్ క్లియర్ అయ్యేనా..? సుప్రీంకోర్టులో తీర్పు ఎవరి వైపు..?