కంటి చుక్కల మందు తయారీకి అనుమతి ఇవ్వాలని ఆనందయ్య పెట్టుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు.. సాంకేతిక కారణాలు చూపి తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనాను ఎదుర్కొనేందుకు తయారు చేసిన కంటి చుక్కల మందుపై న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. కాగా ఆనందయ్య తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో తాము దాఖలు చేసిన దరఖాస్తును, ప్రభుత్వ సమాధానాన్ని ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టు ముందుంచారు.. ఆనందయ్య తయారు చేసిన కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది.. కరోనాతో ఎంతమంది మరణించారు?. ఆనందయ్య మందుతో ఎంత మంది చనిపోయారో వెల్లడించాలని ఆదేశించింది.. అనంతరం ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని సూచించింది.
ఆనందయ్య మందును నాటు మందుగానే గుర్తిస్తున్నామని, ఆ మందును ఆయుర్వేద మందు అనలేమని ఆయుష్ కమిషనర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మందు చెడు ప్రభావాన్ని కలుగచేస్తుందని అల్లోపతిక్ వైద్యులు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.
Also Read: ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ’.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్