AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగుల చికిత్సపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు జారీ

|

Apr 28, 2021 | 3:57 PM

AP High Court: ఏపీలో కరోనా కాలరాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య ఏ...

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగుల చికిత్సపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు జారీ
Ap High Court
Follow us on

AP High Court: ఏపీలో కరోనా కాలరాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త తోట సురేష్‌, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, ఫీజుల వసూలు, ఇతర అంశాలపై వెంటనే ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.

ఆస్పత్రుల్లో కరోనా రోగులు, ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలపై డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, రెమ్‌డెసివిర్‌, అత్యవసర మందులపై రోజువారీ సమీక్ష ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆక్సిజన్‌ కొరతపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని కూడా తెలిపింది. రాష్ట్రంలో ఐసోలేషన్‌ కేంద్రాలను పెంచాలని, అలాగే పడకల సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకోవాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

CM YS Jagan: టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న సీఎం జగన్

Covid Tablets: కరోనా వ్యాక్సిన్‌కు బదులు టాబ్లెట్​.. ప్రయోగాలు ప్రారంభం.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే..