AP News: అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌

అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని డెవలెప్‌మెంట్‌పై ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్‌‌కు రంగం సిద్ధం చేసింది. వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపు ఎన్‌-9 రోడ్డు దగ్గర నుంచి జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతోంది..

AP News: అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌
Amaravati
Follow us

|

Updated on: Aug 07, 2024 | 7:26 AM

అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా.. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు సీఆర్డీఏ అధికారులు. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియను షురూ చేశారు. దీనికి సంబంధించి మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. రాజధాని పరిధిలోని మొత్తం 58 వేల ఎక‌రాలు, 99 డివిజ‌న్లలోని ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొలగిస్తామన్నారు మంత్రి నారాయణ. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించినవారికి ఆయా స్థలాలపై క్లారిటీ వ‌స్తుంద‌ని చెప్పారు. బైట్‌.. నారాయణ, ఏపీ మంత్రి

మరోవైపు.. ఏపీలోని అనధికార లే-అవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. అనధికార లేఅవుట్లు కొనుగోలు చేసి మోసపోకుండా పేపర్లు, టీవీల ద్వారా ప్రజలను అలెర్ట్‌ చేస్తామని చెప్పారు. అనధికార లేఅవుట్ల సర్వే నంబర్లను రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపి.. రిజిస్ట్రేషన్లు చేయకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. అలాగే.. అధికార, అనధికార లేఅవుట్ల సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా మూడు నెలల్లో ప్రత్యేక వెబ్‌సైట్‌ తీసుకోస్తామన్నారు మంత్రి నారాయణ. మొత్తంగా.. కూటమి సర్కార్‌ రాకతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఏపీ రాజధాని పరిధిలోని జంగిల్ క్లియరెన్స్‌‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో కొత్త కళను సంతరించుకోనుంది. ముళ్ల కంపల తొలగింపు ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి కానుండడంతో అమరావతి మళ్లీ కళకళలాడబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌
అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌
నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. ఎవరంటే?
షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసిన స్టూడెంట్ లీడర్.. ఎవరంటే?
బ్రేకప్ బాటలో మరో జంట.. ప్రేమకు సాహో బ్యూటీ స్వస్తి..
బ్రేకప్ బాటలో మరో జంట.. ప్రేమకు సాహో బ్యూటీ స్వస్తి..
ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌..
ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌..
త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?
త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?
టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్..!
టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్..!
ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
'కెప్టెన్ మెటీరియల్.. 3 ఫార్మాట్లలో రోహిత్ వారసుడు అతడే'
'కెప్టెన్ మెటీరియల్.. 3 ఫార్మాట్లలో రోహిత్ వారసుడు అతడే'
టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌
టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌