Andhra Pradesh: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఏపీ గవర్నర్‌.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..

కరోనా తదనంతర సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ గురువారం రాత్రి విజయవాడ చేరుకున్నారు

Andhra Pradesh: కరోనా నుంచి  పూర్తిగా కోలుకున్న ఏపీ గవర్నర్‌.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..

Updated on: Dec 09, 2021 | 9:06 PM

కరోనా తదనంతర సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ గురువారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీరిని ప్రత్యేక విమానంలో ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్ కు తరలించారు. కాగా ప్రస్తుతం దంపతులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, బబితా దంపతులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి హరిచందన్ దంపతులను పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ కు వైద్య సేవలు అందిస్తున్న ప్రత్యేక బృందంతో సమావేశమైన సిసోడియా , భవిష్యత్తులో ఆరోగ్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. డిశ్చార్జికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇక విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తాను అన్ని విధాల పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాస్క్‌ ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలను కోరారు.

Also read:

TTD Rooms: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్ధు.. ఎందుకోసమంటే?

Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..

Kadapa News: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొత్త సమస్య..