Sarpa Mitra: మీ నివాసాల్లోకి పాములొచ్చాయా? డోంట్‌ వర్రీ.. ఈ ఒక్క కాల్‌తో సమస్యకు చెక్‌..

మానవులు, వన్యప్రాణుల సమన్వయానికి, ఇరువురి మధ్య ఘర్షణలు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది.. ఇందులో భాగంగానే గ్రామనికో సర్పమిత్ర అనే సరికోత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి గ్రామంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రజలకు వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు సహాయపడనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

Sarpa Mitra: మీ నివాసాల్లోకి పాములొచ్చాయా? డోంట్‌ వర్రీ.. ఈ ఒక్క కాల్‌తో సమస్యకు చెక్‌..
Sarpa Mitra Scheme

Edited By: Anand T

Updated on: Nov 10, 2025 | 2:48 PM

ఏపీలో మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు సరికొత్తగా రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ ను గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లను ఏర్పాటు చేయాలనీ ప్రణాలికలు చేసింది. నగరాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన సర్ప రక్షణ వ్యవస్థను ఇక గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోను వాలంటీర్లను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. మొట్టమొదటిసారి రాష్టంలో ఇలాంటి విసృత కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రజల భద్రతకు కూడా ప్రత్యక ఆదరణ వస్తుందని నిపుణుల తమ అభిప్రాయాన్ని వ్య్వక్తం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఫారెస్ట్ అధికారులు రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ మానవ, వన్యప్రాణుల మధ్య సమన్వయానికి విప్లవాత్మక చర్యకు చొరవచూపనుంది. ఈ ప్రాజెక్ట్ లోని 11 ముఖ్య అంశాల్లో సర్పమిత్ర వాళ్ళంటిర్లు ఒకటి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా పాముకాట్ల వలన 40 వేల మంది వరకు చేరిపోతున్నారు.. ఈ మరణాలను జాతీయ ఆరోగ్య సమీక్షలు తెలియజేశాయి.. మానవుడు, వన్యప్రాణాల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ఏఐ , డ్రోన్, రేడియో కాలర్‌లు, మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్స్‌లు వంటి సాకేతిక సాధనాలతో పాటు గ్రామస్థాయి వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చే పాములు నుంచి ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా చూడడమే సర్పమిత్రల ప్రధాన విధి.. వీరు గ్రామాల్లోకి వచ్చిన పాములను పట్టుకొని సురక్షితంగా వాటిని అడవులలోకి వదిలేస్తారు. ఇది కేవలం ప్రాణి రక్షణకు మాత్రమే కాకుండా మునుషుల భద్రతకు కూడా దోహదపడుతుంది.. ప్రతి పంచాయితీలో ఒకొక్క వాలంటీరును ఎంపిక చేస్తారు.. స్థానిక ప్రజలతో మాట్లాడి వీరి విధులు నిర్వహిస్తారు. రాత్రి సమయాల్లో పాములు తిరగడం సాధారణం కాబట్టి వీరు 24/7 అలర్టుగా ఉంటూ యాప్ ద్వారా అలర్ట్ లు పొందుతూ చర్యలు తీసుకుంటారు.

దేశంలో పాము రక్షణ కార్యక్రమాలు ఉన్నాయ్.. కానీ గ్రామ స్థాయి వాలంటీర్ల విస్తృత వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోనే మొడ్డమొదటిసారి ఏర్పాటు కానుంది. తమిళనాడులో ఇరుల గిరిజనులు 1970 నుంచి పాములు పట్టుకోవడానికి కో – ఆపరేటివ్ లు ఏర్పాటు చేశారు. చె న్నై లో 2000కి పైగా ఉన్నాయ్.. కేరళలో స్థానిక ngoలు పనిచేస్తున్నాయి.. కానీ పంచాయితీ స్థాయిలో వాలంటీర్లు లేరు. మహారాష్టలో సర్పమిత్ర పేరుతో ngoలు పనిచేస్తున్నాయి.. కానీ ప్రభుత్వ స్థాయిలో మాత్రం విస్తరణ లేదు.. ఏపీలో ఈ మోడల్ టెక్నాలజీ తో ముడిపడి ఉండడం వలన ఇది భారత దేశానికి మోడల్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.