AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!

|

Jun 11, 2021 | 9:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది.

AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!
Ap Council Hall
Follow us on

AP Governor Quota MLC: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. జూన్‌ 11తో ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాసులు, పి.శమంతకమణిల పదవీ కాలం ముగిసింది. ఖాళీ అయిన స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది. ఇక, గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నలుంచి తోట త్రిమూర్తులు ఉన్నారు. ఇందులో రమేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం ప్రొద్దుటూరు పురపాలక సంస్థలో కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

గతంలో చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన మోషేను రాజుకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేకపోయిన లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. గతంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన రమేశ్‌ యాదవ్‌కు ఈసారి అవకాశం కల్పించారని చెబుతున్నారు. ఇక తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని చాలా రోజుల నుంచే ప్రచారం సాగుతోంది.

Read Also…  Polavaram Project: పోలవరం ప్రాజెక్టు తొలి ఫలితానికి అంకురార్పణ.. డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల