AP News: ఇది కదా కావాల్సింది.. ఇక విద్యార్ధులకు పండుగే పండుగ.. అదేంటో తెల్సా

ఏపీ విద్యార్ధులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించింది కూటమి సర్కార్. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న విద్యార్ధులకు ఇకపై రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా మిడ్ డే మీల్ లో కొత్త మెనూను తీసుకురానుంది. జోన్ల వారీగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

AP News: ఇది కదా కావాల్సింది.. ఇక విద్యార్ధులకు పండుగే పండుగ.. అదేంటో తెల్సా
Mid Day Meal

Updated on: Feb 22, 2025 | 5:21 PM

ఏపీ విద్యార్ధులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించింది కూటమి సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పధకాన్ని అమలు చేస్తోంది. తాజాగా జోన్ల వారీగా మిడ్ డే మీల్ మెనూలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. కొత్త మెనూనూ 4 జోన్లవారీగా ఈ రెండు నెలల పాటు అనగా ఏప్రిల్ వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా అమలుకు విద్యాశాఖ సిద్దమైంది. ఆ తర్వాత అభిప్రాయాలు స్వీకరించి.. మెనూలో తుది మార్పులు తీసుకురానుంది. జోన్ 1లోకి ఉత్తరాంధ్ర, జోన్ 2లోకి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు కాగా.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జోన్ 3లోకి.. రాయలసీమను జోన్ 4గా విభజించింది. ఆయా ప్రాంతాల్లోని స్థానిక వంటలు, అభిరుచులు, పోషకాలను పరిగణనలోకి తీసుకుని ఆహరం అందించాలని విద్యాశాఖ ఆదేశించింది.

జోన్ల వారీగా మిడ్ డే మీల్ ఇలా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి