Veera Simha Reddy Pre Release Event: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు పర్యటనల నేపథ్యంలో చోటుచేసుకున్న తొక్కిసలాటల దృష్ట్యా, ఎవైనా పార్టీలు, సంస్థలు, వ్యక్తులు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో1 అమలులోకి తెచ్చింది. దీంతో బుధవారం చంద్రబాబు కుప్పం పర్యటనలో రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇలా ఉండగా.. ఈ జీవో ప్రభావం జనవరి6వ తేదీన ఒంగోలులో జరగాల్సిన బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి, విశాఖపట్టణంలో నిర్వహించనున్న చిరంజివి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లపై పడనుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే ఒంగోలులో ముందుగా నిర్వహించిన స్థలంలో అనుమతి నిరాకరించారని, వేరే స్థలంలో పెట్టుకోవాలని పోలీసులు సూచించారన్న ప్రచారం సాగుతోంది.
జీవో1 నిబంధనలు మూవీ ఈవెంట్లకు వర్తిస్తాయని.. నిబంధనలు విశాఖలో చిరంజివి సినిమా ఈవెంట్‌పై కూడా జీవో1 పడనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. టీవీ9 బిగ్ డిబేట్‌లో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మూవీ ఈవెంట్లపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, స్థానిక పోలీసు అధికారులు ఈవెంట్ల నిర్వహణ అనుమతికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..