తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు. 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. తిరుపతి పోలింగ్‌లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు.
అయితే, ఓటమి భయంతోనే విపక్ష పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌లో గందరగోళాన్ని సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు.
కాగా, చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై సజ్జల ఆసహానం వ్యక్తం చేశారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తాను గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మహన్‌రెడ్డి వెంట 75 శాతానికిపైగా ఓటర్లు ఉన్నారని సజ్జల గుర్తు చేశారు. దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిపాజిట్ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల అన్నారు.
Read Also… Nara Lokesh: ‘పుంగునూరు వీరప్పన్ పెద్దిరెడ్డి’.. ఏపీ మంత్రిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు.!