YS Viveka Murder Case: జగన్ అలా చెప్పేవారు.. వివేకా హత్య కేసుపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

|

Mar 03, 2022 | 11:19 AM

Former DGP Gautam Sawang: ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకోక మలుపుతిరుగుతోంది. వివేకా హత్య కేసు విషయంలో సీఎం వైఎస్ జగన్‌, తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్

YS Viveka Murder Case: జగన్ అలా చెప్పేవారు.. వివేకా హత్య కేసుపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన
Gautam Sawang Ys Jagan
Follow us on

Former DGP Gautam Sawang: ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకోక మలుపుతిరుగుతోంది. వివేకా హత్య కేసు విషయంలో సీఎం వైఎస్ జగన్‌, తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వివేకా కేసు (YS Vivekananda Reddy Murder Case) విషయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సవాంగ్ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయంపై స్పందిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సురేంద్రనాధ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తనను ఎప్పుడు కలవలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టంచేశారు. వివేకా, అవినాష్ కుటుంబాలు తనకు రెండు కళ్లు అని సీఎం జగన్ (YS Jagan) చెప్పారని పేర్కొన్నారు. వారు తనను కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని వాళ్లకు చెప్పానంటూ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు.

వివేకా హత్య కేసు విషయంలో చట్టం ప్రకారం ముందుకెళ్లాలని, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని సీఎం జగన్ చెప్పారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు కావాల్సిన అన్ని వివరాలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారన్నారు. ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చూడాలని తనతో చెప్పేవారని సవాంగ్ గుర్తు చేసుకున్నారు.

ఈ కేసుపై సెప్టెంబరు 2019లో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి చెప్పానని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉండగా దీనిపై ఎవరూ కలవలేదని సవాంగ్ ప్రకటనలో స్పష్టం చేశారు.

Also Read:

Pumpkin Seeds: గుమ్మడి గింజలను పడేస్తున్నారా.. గింజల పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Russia-Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి తరువాత నాటోలో చేరడానికి ప్రయత్నిస్తున్న యూరప్ దేశాలు