Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor Politics: నల్లారి వారింట పొలిటికల్ సెగలు.. ఐదేళ్లుగా సొంతింటి గడప తొక్కని మాజీ సీఎం

Andhra Pradesh Politics: తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు నల్లారి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్తూరు పాలిటిక్స్‌లో చక్రం తిప్పిన నల్లారి ఫ్యామిలీ..

Chittoor Politics: నల్లారి వారింట పొలిటికల్ సెగలు.. ఐదేళ్లుగా సొంతింటి గడప తొక్కని మాజీ సీఎం
Nallari Kiran Kumar Reddy
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 21, 2022 | 6:33 PM

Andhra Pradesh Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఆయనకో ప్రత్యేకత ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఆయనదే కీ రోల్‌. అలాంటి నాయకుడు.. ఐదేళ్లుగా సొంతింటి గడప తొక్కట్లేదట? ఆ స్థాయి నాయకుడు ఇప్పుడెందుకిలా? కారణం ఏమయ్యుంటుంది? ఏపీ పొలిటికల్‌ కారిడార్‌లో ఇప్పుడు ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు నల్లారి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్తూరు పాలిటిక్స్‌లో చక్రం తిప్పిన నల్లారి ఫ్యామిలీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలక పదవుల్ని దక్కించుకుంది. నల్లారి అమర్నాథ్‌ రెడ్డి మంత్రిగా ఒక శకం నడిపిస్తే.. ఆయన కుమారుల్లో ఒకరైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అంతేకాదు, ఉమ్మడి ఏపీకి ఆఖరి ముఖ్యమంత్రిగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక నేతగా… పాలిటిక్స్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు కిరణ్‌కుమార్‌ రెడ్డి.

పొలిటికల్‌గా ఓ రేంజ్‌లో చక్రం తిప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి… ఇప్పుడు సొంత జిల్లాలో, అదీ.. సొంతూళ్లో సొంతింటికి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. దానికి కారణం, తన తమ్ముడు నల్లారి కిశోరేనన్నది పొలిటికల్‌ టాక్‌. అన్న సీఎంగా ఉన్నప్పుడు జిల్లాలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కిషోర్‌ ఇప్పుడు.. టీడీపీలో ఉన్నారు. 2019లో ఆ పార్టీ తరపునే పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే, కిరణ్‌ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా ఉండిపోయారు. కీలక అనుచరులతో టచ్‌లో ఉంటున్నా పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండటం లేదు. అయితే, జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నా.. కలికిరి మండలంలోని సొంతూరు నగరిపల్లికి వెళ్లలేని పరిస్థితి ఆయనది. ఎందుకంటే, టీడీపీ కీలక నేతగా.. తన తమ్ముడు నల్లారి కిశోర్‌, ఆ ఇంటి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నారట. దీంతో, కాంగ్రెస్‌ కండువా వేసుకుని.. పసుపు జెండా పట్టుకున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి కిరణ్‌ ఇష్టపడం లేదట. దీంతో, కలికిరి వచ్చినా.. అప్పట్లో సీఎంగా తాను కట్టించిన ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌లోనే బసచేసి నేతలతో మాట్లాడి వెళ్లిపోతున్నారంట కిరణ్‌. తమ్ముడి తీరు వల్లే కిరణ్‌ ఐదేళ్లుగా సొంతూరి ముఖం చూడలేకపోతున్నారని పొలిటికల్‌ కారిడార్‌లో చర్చ జరుగుతోంది. గెస్ట్‌ హౌజ్‌కు కిలోమీటర్‌ దూరంలోనే ఉన్నా.. సొంతింటివైపు కిరణ్‌ కన్నెత్తి చూడటం లేదంటున్నారు స్థానికులు.

నల్లారి సోదరుల మధ్య రాజకీయ విభేదాలతో.. నియోజకవర్గ కేడర్‌ కూడా రెండుగా చీలిపోయిందట. కిషోర్ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ.. కిరణ్‌ ముఖ్య అనుచరుల్లో చాలామంది ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తున్నారట. అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కుటుంబంలోనూ, బంధువుల్లోనూ చీలిక వచ్చిందట. సీఎంగా ఓ వెలుగువెలిగిన కిరణ్‌.. తమ్ముడు చేసిన నిర్వాకానికి సొంతూరికి దూరమయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారట. నల్లారి బ్రదర్స్ మధ్య ముదిరిన పొలిటికల్‌ వార్‌.. ఏ మలుపు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

-సంతోష్ ప్యాట, టీవీ9 తెలుగు, హైదరాబాద్

Also Read..

CM KCR: దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

చిన్నారి ముందు తలవంచిన ఆటిజం.. సముద్రాన్నే ఈది సరికొత్త రికార్డును సృష్టించిన బాలిక..

లైలా రిజల్ట్.. అభిమానులకు విశ్వక్ సేన్ లెటర్..
లైలా రిజల్ట్.. అభిమానులకు విశ్వక్ సేన్ లెటర్..
ప్రిన్స్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
ప్రిన్స్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. రెండో విశిష్టత ఏంటంటే..
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. రెండో విశిష్టత ఏంటంటే..
ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనేలేదు
ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనేలేదు
ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!