AP DGP: గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి.. 

|

Feb 15, 2022 | 2:51 PM

AP DGP Goutam Sawang transferred: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ (Goutam Sawang) పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి

AP DGP: గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి.. 
Ap Dgp
Follow us on

AP DGP Goutam Sawang transferred: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ (Goutam Sawang) పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (Rajendranath Reddy) ని కొత్త డీజీపీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం సవాంగ్‌కు ఆదేశించింది. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్‌ను బదిలీ చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. దీనిలో భాగంగా రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రొఫైల్

కొత్త డీజీపీగా నియాకమైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు.  మే 2020 నుండి ఈ పదవిలో ఉన్న రాజేంద్రనాధ్ రెడ్డి.. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు.  హైదరాబాద్‌ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా సేవలందించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ GAD వంటి పదవులను నిర్వహించారు.

దామోదర్ గౌతమ్ సవాంగ్ ప్రొఫైల్.. 

1963 జూలై 10న జననం, స్వస్థలం అరుణాచల్ ప్రదేశ్

పురస్కారాలు
2002 పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్
2003 పోలీస్ మెడల్ ఫర్ గ్యాల్లంట్రీ
2005 సి ఆర్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ కమెన్డేషన్ డిస్క్
2015 రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగులిషేడ్ సర్వీస్

1986లో పోలీస్ బాధ్యతలు
డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్(డీజేపీ)
దామోదర్ గౌతమ్‌ సవాంగ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్
మే 2019న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా నియామకం
ది బెటర్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో 2021 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా సవాంగ్

ప్రొఫైల్
గౌతమ్ సవాంగ్‌ 10 జులై 1963న జననం
ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో సేవలు
గౌతమ్ సవాంగ్‌ అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ప్రాథమిక విద్య
చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ
ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ పట్టా

వృత్తి జీవితం
గౌతమ్ సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి
చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభం
చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పని
2001 నుండి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు
2003 నుండి 2004 వరకు ఎస్‌ఐబీ డీఐజీ
2004 నుండి 2005 వరకు ఏపీఎస్పీ పటాలం డీఐజీగా బాధ్యతలు
ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్ళిన సవాంగ్
2005 – 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పని

2008 నుండి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు
ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పని
2016లో డీజీగా పదోన్నతి అందుకుని 2018 వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌
2018 జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పని
13 ఆగష్టు 2019న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ డీజీపీగా నియామకం

Also Read:

CM Jagan: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..