Pawan Kalyan: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అల్లు అర్జున్ కేసుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

|

Dec 30, 2024 | 1:30 PM

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది.. అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు.

Pawan Kalyan: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అల్లు అర్జున్ కేసుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది.. అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లుఅర్జునే కాదు..టీమ్‌ అయినా సంతాపం తెలపాల్సింది.. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన పవన్ కల్యాణ్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్‌ రేట్ పెంచడం కూడా.. పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పారు.

కాగా.. డిసెంబర్​4 చిక్కడపల్లి సంధ్య థియేటర్ దగ్గరకు పుష్ప టూ ప్రీమియర్‌ షోకు ఫ్యామిలీతో వచ్చారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో ఏ11గా అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను పోలీసులు డిసెంబర్ 13న అరెస్టు చేశారు.. నాంపల్లి కోర్టు రెండువారాల రిమాండ్‌ విధించినా.. హైకోర్టు బెయిల్‌ మంజూరుచేయడంతో రిలీజయ్యారు అల్లు అర్జున్‌. కానీ ఫార్మాలిటీస్‌ ఆలస్యం కావటంతో ఓ రాత్రంతా ఆయన చంచలగూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది.. అయితే, అల్లు అర్జున్ అరెస్టును పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం.. సంచలనంగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్టు చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి.. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు.. పోలీసులు కక్షపూరితంగా అరెస్టు చేయలేదని.. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు.

లైవ్ వీడియో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..