Pawan Kalyan: దటీజ్ పవన్.. మంచి చేస్తే అభినందించడంలో ఆయనే ఫస్ట్..

|

Oct 25, 2024 | 6:45 AM

అమరావతిలో రైల్వేలైను నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రైల్వేలైను నిర్మాణానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan: దటీజ్ పవన్.. మంచి చేస్తే అభినందించడంలో ఆయనే ఫస్ట్..
Pawan Kalyan Thanked Pm Modi
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వేలైను నిర్మాణానికి కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం–అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందిని పేర్కొన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు

రాజధానికి వచ్చే ప్రజలకు, అధికారులు, ఉద్యోగులకే కాదు అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారికి ఈ రైల్వే లైన్ అనువుగా ఉంటుందిని చెప్పారు. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ రైలు మార్గం కచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి క్రియాశీలకంగా మారబోతోందన్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కొత్త రైలు మార్గం అనుసంధామయ్యేలా ఉంటుంది కాబట్టి ఈ రైలు మార్గం వెంబడి పారిశ్రామిక పురోగతి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణహితంగా, 6 కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గించే విధంగా నిర్మితమవుతోందన్నారు. ఇన్ని కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గించడం అంటే 25 లక్షల చెట్లు పెంచినట్లే అని వెల్లడించారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా 19 లక్షల పని దినాలు కల్పించే అవకాశం లభించడం గొప్ప విషయమన్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కి ఎలాంటి విఘాతం లేకుండా అధునాతన పరిజ్ఞానంతో రైల్వే లైన్ నిర్మాణం కాబోతుందని చెప్పుకొచ్చారు. అమరావతి రైల్వే లైన్ కచ్చితంగా మోడల్ రైలు మార్గంగా నిలుస్తుందన్నారు. బహు ముఖ ప్రయోజనం కలిగిన నూతన రైలు మార్గాన్ని సాధించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడకి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి