AP Curfew Update: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రేపట్నుంచి బ్యాంకు టైమింగ్స్ లో మార్పులు జరగనున్నాయి.
రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు రేపటి నుంచి మే 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పని చేస్తాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కస్టమర్లు అత్యవసరమైతేనే బ్యాంకు రావాలని సూచించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
అటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతి ఇవ్వగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా బంద్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు సైతం నిలిచిపోతాయి.
Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్