AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 7న చిత్తూరుకు రాష్ట్రపతి రాక‌.. ఆ ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ఆదిత్యనాథ్‌ ఆదేశం

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈనెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కోవింద్‌ పర్యటించే మదనపల్లె, సదుమ్‌ల్లో పటిష్టమైన..

ఫిబ్రవరి 7న చిత్తూరుకు రాష్ట్రపతి రాక‌.. ఆ ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ఆదిత్యనాథ్‌ ఆదేశం
K Sammaiah
|

Updated on: Feb 03, 2021 | 6:03 PM

Share

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈనెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కోవింద్‌ పర్యటించే మదనపల్లె, సదుమ్‌ల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అమరావతి సచివాలయం నుంచి సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు.

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 7వ తేది మధ్యాహ్నం చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ యోగశాల, భారత్ యోగ విద్యాకేంద్రాన్ని ప్రారంభించనున్నారని సిఎస్ తెలిపారు. అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంఖుస్థాపన చేయనున్నారని చెప్పారు.

అనంతరం సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటిస్తారని సీఎస్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. వీడియో సమావేశంలో పాల్గొన్న ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమ వివరాలను సిఎస్‌కు వివరించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పాల్గొన్న డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టనున్నబందోబస్తు ఏర్పాట్లుపై వివరించారు.

విజయవాడ నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యంగా ఎఐఆర్, దూరదర్శన్‌లతో పాటు నాలుగు వీడియో టీంలను కవరేజి నిమిత్తం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లా కలక్టర్, ఎస్పీలు సహా సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖల పరంగా చ‌ర్య‌లు చేపట్టనున్న ఏర్పాట్లను సిఎస్‌కు వివరించారు

మరిన్ని ఇక్కడ చదవండి :

ఎస్‌ఈసీ ఈవాచ్ యాప్‌పై రగులతున్న వివాదం.. ముమ్మాటికి నిమ్మగడ్డ పర్సనల్‌ యాప్‌ అంటున్న వైసీపీ నేతలు