AP Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఆ ఏడు జిల్లాల్లో భారీగా పెరిగిన కేసులు..

|

Jan 11, 2022 | 5:41 PM

AP Coronvirus Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. కేసుల సంఖ్య

AP Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఆ ఏడు జిల్లాల్లో భారీగా పెరిగిన కేసులు..
Ap Corona
Follow us on

AP Coronvirus Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో (సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు) 36,452 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,831 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉపశమనం కలిగించే విషయమేంటంటే..? కరోనాతో రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,84,674 కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది.

కాగా.. గత 24 గంటల్లో 242 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,62,974 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 7,195 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో కేసులు భారీగా నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 467 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం 295, క్రిష్ణా జిల్లాలో 190, గుంటూరు 164, అనంతపురం 161, నెల్లూరు 129, శ్రీకాకుళం 122 కేసులు నమోదయ్యాయి.

ఇదిలాఉంటే.. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూను విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే.. ఈ కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Ap Corona Updates

Also Read:

Amla: ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. ఉసిరిని అస్సలు తినకూడదు.. అవేంటో మీరే తెలుసుకోండి..

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..