AP Corona Cases: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా వివరాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ బులిటెన్ రిలీజ్ చేసింది. కొత్తగా 36,189 నమూనాలను పరీక్షించగా 117 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకపోవడం ఊరటనిచ్చే విషయం. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 7,152 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా మరో 128 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 8,78,956 మందికి పైగా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,358 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,30,12,150 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.
Also Read :
ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వృద్ధ మహిళ.. అందులో బంగారు ఆభరణాలు.. డ్రైవర్ ఏం చేశాడో తెల్సా..?