
ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఐదు మినహా.. మిగిలిన అన్ని జిల్లాలోనూ పాజిటివిటీ రేటు తగ్గింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కర్ఫ్యూ సత్ఫలితాలను ఇస్తోంది. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,93,354 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నిన్న 3,963 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 18,42,432కి చేరింది. అటు తాజాగా 38 మంది వైరస్ కారణంగా మరణించడంతో.. మృతుల సంఖ్య 12744కి చేరింది.
ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం 141, చిత్తూరు 616, తూర్పుగోదావరి 760, గుంటూరు 313, కడప 171, కృష్ణ 350, కర్నూలు 45, నెల్లూరు 261, ప్రకాశం 296, శ్రీకాకుళం 113, విశాఖపట్నం 163, విజయనగరం 108, వెస్ట్ గోదావరి 504 కేసులు నమోదయ్యాయి.
Also Read:
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..
సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!
#COVIDUpdates: 01/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,90,459 పాజిటివ్ కేసు లకు గాను
*18,39,537 మంది డిశ్చార్జ్ కాగా
*12,744 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 38,178#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ii0SYssG3A— ArogyaAndhra (@ArogyaAndhra) July 1, 2021