CM Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ

| Edited By: Subhash Goud

Aug 16, 2021 | 6:51 AM

Jagananna Vidya Kanuka Kits: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇవాళ (సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రెండో విడత 'నాడు-నేడు' పనులకు..

CM Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ
Cm Jagan
Follow us on

Jagananna Vidya Kanuka Kits: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇవాళ (సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రెండో విడత ‘నాడు-నేడు’ పనులకు సీఎం జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘జగనన్న విద్యాకానుక’ కింద పిల్లలకు సీఎం వైయ‌స్ జగన్ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో స్థానిక జెడ్పీ హైస్కూలులో రేపటి జగన్ పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్‌ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇవాళ పరిశీలించారు.

జెడ్పీ హైస్కూలులోని తరగతి గదులు, ఫర్నిచర్, పెయింటింగ్స్, మరుగుదొడ్లను, ‘నాడు–నేడు’ పైలాన్‌ను మంత్రులు పరిశీలించారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడేలా చిన్న సైజు మాస్కులు ఇవ్వాలని తెలిపారు. ‘నాడు–నేడు’లో భాగంగా 10 రకాల మౌలిక సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారని మంత్రి సురేష్‌ ఈ సందర్భంగా అధికార్లను ప్రశంసించారు.

ఇలా ఉండగా, శుక్ర, శనివారం కురిసిన వర్షాలు అడ్డంకిగా మారినప్పటికీ సీఎం పర్యటన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. పాఠశాల ఆవరణలో భారీ వాటర్‌ ప్రూఫ్‌ షెడ్డును నిర్మించారు. షెడ్డు పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు ఏర్పాటు చేసి తోడుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. పాఠశాల ముఖద్వారం వద్ద నేమ్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌ వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.

Read also: Lokesh: ‘మధ్యాహ్నమే నిద్ర పోతున్నారా..’ రమ్య హత్య ఉదంతంపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Guntur Murder: రమ్య హత్యపై సీఎం జగన్ సీరియస్.. వెంటనే చర్యలకు ఆదేశం… యువతి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం