రేపు విశాఖపట్నానికి సీఎం వైఎస్ జగన్.. శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరు…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో సీఎం జగన్‌ పాల్గోంటారు.

రేపు విశాఖపట్నానికి సీఎం వైఎస్ జగన్.. శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరు...

Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2021 | 2:52 PM

AP CM YS Jagan Vishaka tour  : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో సీఎం జగన్‌ పాల్గోంటారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే జగన్‌ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి సీఎం జగన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి 12.50కి విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి… Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్ర.. రాజకీయాలతో సంబంధం లేదన్న ఎంపీ విజయసాయి రెడ్డి..